పిఎంఇండియా
మయన్మార్ లోని యమెథిన్ లో మహిళా పోలీసుల శిక్షణ కేంద్రం యొక్క స్థాయిని పెంచడం కోసం భారతదేశానికి, మయన్మార్ కు మధ్య కుదిరినటువంటి ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఎక్స్- ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ఈ ఎమ్ఒయు పై 2017 సెప్టెంబర్ 6వ తేదీన సంతకాలయ్యాయి.
భారత ప్రభుత్వం నుండి మయన్మార్ ప్రభుత్వం సాంకేతికపరమైన మరియు ఆర్థికపరమైన సహాయాన్ని అందుకొని, తన పోలీసు బలగాల యొక్క సామర్ధ్యాలను వర్ధిల్ల జేసుకోవడం కోసం యమెథిన్ మహిళా పోలీసుల శిక్షణ కేంద్రం స్థాయిని మరింత పెంపొందింపచేసుకొనే ప్రక్రియకు- ఈ ఎమ్ఒయులో- స్థానం కల్పించడమైంది.