Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖామంత్రి శ్రీ శ్రీ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఆల్ నయాన్ను కలుసుకున్న ప్రధాని మోదీ”

“యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖామంత్రి శ్రీ శ్రీ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఆల్ నయాన్ను కలుసుకున్న ప్రధాని మోదీ”

“యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖామంత్రి శ్రీ శ్రీ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఆల్ నయాన్ను కలుసుకున్న ప్రధాని మోదీ”


ఆర్థిక మరియు సాంకేతిక సహాయ సహకారాలను అందిపుచ్చుకోవడానికి భారత్- అరబ్ దేశాల మధ్య ఈ ఏ ఎమ్ అధ్యక్షతన ఇరుదేశాల మధ్య జరగనున్న 11వ భారత్- అరబ్ దేశాల ఉమ్మడి ఒప్పందం సమావేశం భారతలో జరగనుంది. ఈ సమావేశానికి వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖామంత్రి శ్రీ శ్రీ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఆల్ నయాన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఘన స్వాగతం పలికారు.

భారత్- అరబ్ దేశాల మధ్య మైత్రి వల్ల ఇరుదేశాలకే కాకుండా ఆసియా తదితర దేశాల ఉన్నతి, సౌభ్రాతృత్వం ఏర్పడడానికి ఒక నూతన అధ్యాయం మొదలైందని, తాను ఆగష్టు నెలలో చేపట్టిన అరబ్ దేశాల సందర్శన విజయవంతం కావడమే అందుకు నిదర్శనమని ప్రధాని గుర్తు చేశారు. మానవుడు సాధించలేనిది అంటూ ఏమి ఉండదన్నసిద్దాంతంతో అరబ్ దేశాల పాలకుల దూర దృష్టిని, ఆయా దేశాలు వినియోగించుకుంటున్న కొత్త కొత్త ఆవిష్కరణలను, నూతన సాంకేతికతను ఆయన అభినందించారు. అరబ్ దేశాలు మరింత శక్తివంత మవడమేకాకుండా, బహుళ జాతుల సంస్కృతుల జీవన విధానాన్నిపాటించే 2.6 మిలియన్ భారతీయులు ఇక్కడ నివశిస్తున్నారని ప్రధాని తెలిపారు.

అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖామంత్రి శ్రీ శ్రీ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఆల్ నయాన్ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సంస్కృతీ, సాంప్రదాయ సంబంధాలతో పాటు పెట్టుబడులు, వాణిజ్య వ్యాపారాలు, పవర్, అంతరిక్షం, దేశ రక్షణ, భద్రతా, పునరుత్పాద శక్తి, శాస్త్ర సాంకేతికత, టూరిజం మానవ సంబంధాలు మొదలగు రంగాలలో బలమైన బంధం ఏర్పడాలని ప్రధాని మోదీ ఆగష్టు నెల 2015 అరబ్ దేశాల సందర్శనకు వచ్చనప్పుడే అనుకున్నామని అది ఈ సమావేశంతో సాధ్యమవుతుందని ఇరుదేశాల మధ్య మైత్రిపై నమ్మకం కల్గిందని అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖామంత్రి అభిప్రాయ పడ్డారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో మూడవ ప్రపంచ దేశాల అభివృద్ధకి పరిశోధన మరి అధ్యయనానికి ఇరుదేశాలు పాటుబడాలని, అరబ్ ఎమిరేట్స్ దేశం భారత్ లో పెట్టుబడులు, కంపెనీలు పెట్టగల అవకాలశపై కాసేపు అంతర్గతంగా మాట్లాడుకున్నారు.

భారతదేశ సందర్శనకు తగిన సమయం చూసుకొని అబుదాబీ యువరాజు భారత్ కు రావాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ సాధరంగా ఆహ్వానించారు.

***/center>