Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యు.ఎస్. ల్యాండ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సమాచారాన్ని మార్పిడి చేసుకోవడంలోను మరియు ఆ సమాచారం యొక్క ఉపయోగంలోను సహకారం కోసం భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ ఆర్ ఒ), యునైటెడ్ స్టేట్స్ జియొలాజిక‌ల్ స‌ర్వే (యు ఎస్‌ జి ఎస్‌) ల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


యు.ఎస్. ల్యాండ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సమాచారాన్ని మార్పిడి చేసుకోవడంలోను మరియు ఆ సమాచారం యొక్క ఉపయోగంలోను సహకారం కోసం భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ ఆర్ ఒ.. ఇస్రో), యునైటెడ్ స్టేట్స్ జియొలాజిక‌ల్ స‌ర్వే (యు ఎస్‌ జి ఎస్‌) ల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు జరిగిన విషయాన్ని కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ ఎమ్ ఒ యు పై 2016 జులై 9వతేదీన సంతకాలయ్యాయి.

యుఎస్‌జిఎస్ యొక్క లాండ్‌శాట్ 7 & 8 ల డాటాను భారతదేశంలో అందుకోవ‌డానికి ఇస్రో కు, అలాగే యు ఎస్ ప్రాంతానికి సంబంధించి ఇస్రో యొక్క రిసోర్స్‌శాట్ -2 (ఎడబ్ల్యు ఐఎఫ్ ఎస్ మరియు ఎల్ ఐ ఎస్ ఎష్ III) సమీకరించే డాటాను యుఎస్ జిఎస్ అందుకోవ‌డానికి ఈ ఎ మ్ ఒ యు వీలు క‌ల్పిస్తుంది.

పూర్వ రంగం:

పౌర అంత‌రిక్ష రంగంలో నేష‌న‌ల్ ఏరో నాటిక్స్‌, స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్‌( ఎన్ ఎ ఎస్ ఎ.. నాసా), నేష‌న‌ల్ ఓషియానిక్‌ అండ్ అట్మాస్ఫియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్‌ (ఎన్ ఒ ఎ ఎ), యునైటెడ్ స్టేట్స్ జియొలాజిక‌ల్ స‌ర్వే (యు ఎస్‌ జి ఎస్‌) వంటి సంస్థ‌లతో సహా ప‌లు అమెరికా సంస్థ‌ల‌తో ఇస్రోకు చెందిన అంత‌రిక్ష విభాగం స‌హ‌కారాన్ని పొందుతోంది. యు ఎస్‌ జి ఎస్ నిర్వ‌హిస్తున్న ఉప‌గ్ర‌హాల‌లోని లాండ్‌శాట్ సిరీస్‌లో పంపే స‌మాచారాన్ని భార‌త దేశ శాస్త్ర‌వేత్త‌లు ఇండియ‌న్ రిమోట్ సెన్సింగ్ కార్య‌క్ర‌మం ప్రారంభంలో వాడారు. ఇస్రో 1984 నుండి 2001 వ‌ర‌కు లాండ్‌శాట్ ఉప‌గ్ర‌హ స‌మాచారాన్ని షాద్‌న‌గ‌ర్‌లోని త‌న భూత‌ల కేంద్రం ద్వారా అందుకొనేది. యు ఎస్‌ జి ఎస్ లాండ్‌శాట్ -8ని 2013 ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌యోగించింది. లాండ్‌శాట్ స‌మాచారాన్ని నేరుగా భార‌తదేశంలో అందుకొనేందుకు ఇస్రో ఆస‌క్తి వ్య‌క్తం చేసింది. ఇస్రోకు చెందిన రిసోర్స్ శాట్ -2 ఉప‌గ్ర‌హం నుండి స‌మాచారాన్ని అందుకొనేందుకు అమెరికాకు చెందిన యు ఎస్‌ జి ఎస్ ఆస‌క్తి తెలిపింది.

స‌మాచారాన్ని అందుకోవ‌డం ఇస్రో, యు ఎస్‌ జి ఎస్‌ ల‌కు పరస్పర ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉన్నందువల్ల అవ‌గాహ‌నపూర్వక ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.

***