Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రక్షా బంధన్‌ ప్రాధాన్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


   క్షా బంధన్‌ పర్వదినం ప్రత్యేకతను, తద్వారా లభించే ఆశీస్సుల మహిమను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఏష ప్రభావో రక్షాయః కథిస్తే యుధిష్ఠిర్.

జయదః సుఖదశ్చైవ పుత్రారోగ్యధనప్రదః”

అని ఆయన పేర్కొన్నారు.

అంటే- “యుధిష్ఠిరా! నేను నీకు చెప్పిన రక్షణ ప్రభావం ఇదే. అది విజయాన్ని,

సంతోషాన్ని ఇస్తుంది.. పుత్రసంతానాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను ప్రసాదిస్తుంది” అని అర్థం.