Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్లోని భిల్వారా వాసి శ్రీ బల్వంత్ కుమావత్ను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ

రాజస్థాన్లోని భిల్వారా వాసి శ్రీ బల్వంత్ కుమావత్ను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ


రాజస్థాన్ లోని భిల్వారాకు చెందిన యువకుడు శ్రీ బల్వంత్ కుమావత్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు(శుక్రవారం) కలిశారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావాలని శ్రీ కుమావత్ ప్రగాఢంగా కోరుకున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే వరకు కాళ్లకు చెప్పులు కూడా వేసుకోబోనని రెండేళ్ల క్రితం ఆయన ప్రతిజ్ఞ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పాదరక్షలు లేకుండా తిరుగుతున్నారు.

ఈ రోజు ప్రధానిని కలిసిన అనంతరం శ్రీ కుమావత్ పాదరక్షలు ధరించారు. ఇకపై తన శక్తిని దేశ నిర్మాణం కోసం, సామాజ అభ్యున్నతికి కేటాయించాల్సిందిగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.. కుమావత్ కు సూచించారు. వ్యక్తిగతంగా శారీరక అసౌకర్యాన్ని కలగ చేసే ప్రతిజ్ఞలను ఎప్పుడూ తీసుకోబోవద్దని శ్రీ కుమావత్కు ప్రధాని విజ్ఞప్తి చేశారు.