Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ‌స్థాన్ లోని బార్మ‌ర్ లో రాజ‌స్థాన్ రిఫైన‌రీ ప‌నుల ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న ప్ర‌ధాన‌మంత్రి


రాజ‌స్థాన్ లోని బార్మ‌ర్ జిల్లాలో ప‌చ్ ప‌ద్ర‌లో రాజ‌స్థాన్ రిఫైన‌రీ ప‌నుల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి 2018 జ‌న‌వ‌రి 16వ తేదీన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ హాజ‌రుకానున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాట‌య్యే బ‌హిరంగ స‌భ‌లో కూడా ఆయ‌న ప్ర‌సంగిస్తారు.

రాజ‌స్థాన్ లో ఆయిల్‌, గ్యాస్ నిక్షేపాలు పుష్క‌లంగా ఉన్నాయి. రాజ‌స్థాన్ రిఫైన‌రీ రాష్ర్టంలో ఏర్పాట‌వుతున్న మొద‌టి రిఫైన‌రీ. ఈ రిఫైన‌రీ క‌మ్ పెట్రోకెమిక‌ల్ స‌ముదాయం వార్షిక ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం 9 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నులు. ఈ రిఫైన‌రీలో త‌యార‌య్యే ఉత్ప‌త్తులు బిఎస్ 4 కాలుష్య నియంత్ర‌ణ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం 43 వేల కోట్ల రూపాయ‌లు. హెచ్ పిసిఎల్‌, రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం జాయింట్ వెంచ‌ర్ లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు.

రాజ‌స్థాన్‌, గ‌వ‌ర్న‌ర్, ముఖ్య‌మంత్రి, ప‌లువురు కేంద్ర‌మంత్రులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు.

*******