Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి భవన్‌లో రెండో పౌర పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరైన ప్రధాని

రాష్ట్రపతి భవన్‌లో రెండో పౌర పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరైన ప్రధాని


రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు నిర్వహించిన రెండో పౌర పురస్కారాల ప్రదానోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.

వివిధ రంగాలలో వారు అందించిన విశేష సేవలనూ, వారి అంకితభావాన్ని ఈ పురస్కారాలు చాటుతాయని ప్రధానమంత్రి అన్నారు.

సమాజం పట్ల దేశానికి గల నిబద్ధతకు.. ప్రతి పురస్కార గ్రహీతా ఒక్కో అత్యుత్తమ ఉదాహరణ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

పురస్కార గ్రహీతల జీవిత ప్రస్థానాలు అసంఖ్యాక పౌరులకు స్ఫూర్తిదాయకమన్న ప్రధానమంత్రి.. నిరంతర కృషి, సేవాభావాల శక్తిని అవి అందరికీ గుర్తుచేస్తాయన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన రెండో పౌర పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరయ్యాను. గ్రహీతలు పురస్కారాలను స్వీకరించారు. వివిధ రంగాల్లో వారు అందించిన అసాధారణమైన సేవలనూ, వారి అంకితభావాన్నీ చాటే పురస్కారాలివి. సమాజం పట్ల మనకున్న నిబద్ధతకు..  ప్రతీ పురస్కార గ్రహీత ఒక్కో అత్యుత్తమ ఉదాహరణ. వారి జీవనయానాలు అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తిదాయకం. నిరంతర కృషి, సేవాభావాల శక్తిని అవి అందరికీ గుర్తుచేస్తాయి.”