Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఒడిశాలోని పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించిన ప్రధాని

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా  ఆమెతో కలిసి ఒడిశాలోని పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించిన ప్రధాని


రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సదర్భంగా ఆమెతో కలిసి ఒడిశాలోని పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించటాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

రాష్ట్రపతి స్వగ్రామం పహాడ్‌పూర్ అని పేర్కొన్న ప్రధాని.. ఆమె చేసిన కృషిసేవలు నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

రాష్ట్రపతి ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

రాష్ట్రపతి గారితో కలిసి ఒడిశాలోని పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించటం.. అది కూడా ఆమె పుట్టినరోజు నాడు కావడం నాకెంతో గౌరవంగా ఉందిఇది ఆమె స్వగ్రామంఇక్కడ ఆమె చేసిన కృషి నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం.

ఆమె ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నాను. “