Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శ‌కుల స‌మావేశ మందిరంలో ఇంప్రింట్ ఇండియా క‌ర‌ప‌త్రం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ప్ర‌ధాని సందేశం

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రాష్ర్ట‌ప‌తి భ‌వ‌న్‌లోని సంద‌ర్శ‌కుల స‌మావేశ‌మందిరంలో గురువారంనాడు ఇంప్రింట్ ఇండియా క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించారు. భార‌తదేశానికి అనువైన ప‌ది సాంకేతిక విభాగాల్లో ఎదుర‌య్యే సాంకేతిక‌, ఇంజ‌నీరింగ్ స‌వాళ్ళ ప‌రిష్కారంపై ప‌రిశోధ‌న‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉమ్మ‌డిగా రూపొందించిన ప్ర‌ణాళికే ఇంప్రింట్ ఇండియా.

జాతి అభివృద్ధి, పురోగ‌తికి న‌వ్య ఆవిష్క‌ర‌ణ‌లు, సాంకేతిక ప‌రిజ్ఞానం మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉన్న‌ద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని అన్నారు. అధ్య‌య‌నంలో న‌వ్య ధోర‌ణుల‌కు ఉన్న‌త విద్యా సంస్థ‌లు ప‌ట్టం క‌ట్టాల‌ని ఆయ‌న సూచించారు. భూతాపం, చెత్త‌ను సంప‌ద‌గా మార్చ‌డం వంటి విభాగాల్లో ఎదుర‌య్యే స‌వాళ్ళ‌కు ప‌రిష్కారాలు క‌నుగొన‌డం భార‌త‌వృద్ధికి కీల‌క‌మ‌ని ఆయ‌న చెప్పారు. దేశంలోని ఉన్న‌త విద్యా సంస్థ‌లు ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల త‌యారీ వంటి విభాగాల‌పై దృష్టి పెట్టాల‌ని ఆయ‌న సూచించారు. సైన్స్ విశ్వ‌వ్యాప్తం కావ‌చ్చు గాని…టెక్నాల‌జీ స్థానిక‌మే కావాల‌ని ఆయ‌న సూచించారు. భిన్న విభాగాల్లో విద్యారంగం, పారిశ్రామిక రంగం మ‌ధ్య స‌హ‌కారం పెర‌గాల‌ని ఆయ‌న సూచించారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని మేథోసంప‌న్నుడుగా ప్ర‌ధాని అభివ‌ర్ణిస్తూ ఉన్న‌త విద్యా వ్యాప్తికి ఆయ‌న చేస్తున్న కృషిని కొనియాడారు.