పిఎంఇండియా
రైల్వేల రంగంలో సాంకేతిక సహకారం అంశంపై భారతీయ రైల్వేలకు మరియు ఫ్రెంచ్ కంపెనీ ఎస్ఎన్‌సిఎఫ్ కు మధ్య కుదిరినటువంటి ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి నివేదించడమైంది. ఈ ఎమ్ఒయు పై 2018 మార్చి నెల 10వ తేదీన సంతకాలయ్యాయి.
రైల్వేల రంగంలో తాజా పరిణామాలను మరియు జ్ఞానాన్ని పంచుకొనేందుకు భారతీయ రైల్వేలకు ఒక వేదికను ఈ ఎమ్ఒయు సమకూర్చుతుంది. ఈ ఎమ్ఒయు.. హై స్పీడ్ రైల్ మరియు సెమీ హైస్పీడ్ రైల్, స్టేషన్ నవీకరణ మరియు కార్యకలాపాలు, ప్రస్తుత కార్యకలాపాల మరియు మౌలిక సదుపాయాల ఆధునికీకరణ తో పాటు సబర్బన్ ట్రైన్ ల రంగంలో సహకారానికి ఒక ఫ్రేమ్ వర్క్ ను సమకూర్చుతుంది.
జ్ఞానాన్ని పంచుకోవడం కోసం మరియు నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానం పై చర్చా సభలు/ కార్యశాలలు మరియు శిక్షణ నిర్వహణ; సాంకేతిక నిపుణుల రాకపోకలు; నివేదికలు మరియు సాంకేతిక దస్తావేజుల ఆదాన ప్రదానానికి ఈ ఎమ్ఒయు మార్గాన్ని సుగమం చేస్తుంది.
****