Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన 61,000కు పైగా యువతకు జనవరి 24న నియామక పత్రాలను అందించనున్న పీఎం


వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో18వ రోజ్‌గార్ మేళాలో భాగంగా కొత్తగా ఎంపికైన 61,000కు పైగా యువతకు 24 జనవరి 2026న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించనున్నారు.

 

ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలనే ప్రధానమంత్రి సంకల్పాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన కీలకమైన కార్యక్రమమే రోజ్‌గార్ మేళా. దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి దేశ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల ద్వారా ఇంతవరకు 11 లక్షలకు పైగా నియామక పత్రాల పంపిణీ జరిగింది.

 

దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 18వ రోజ్‌గార్ మేళా నిర్వహిస్తారు. భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎంపికైన నూతన అభ్యర్థులు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఇందులో ముఖ్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగంతో పాటు ఇతర కీలక విభాగాల్లో విధుల్లో చేరతారు.