Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లక్ష్మణ్ రావు ఇనాందార్ శతజయంతి సందర్భంగా 2017 సెప్టెంబర్ 21వ తేదీన సహకార సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

లక్ష్మణ్ రావు ఇనాందార్ శతజయంతి సందర్భంగా 2017 సెప్టెంబర్ 21వ తేదీన 
సహకార సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

లక్ష్మణ్ రావు ఇనాందార్ శతజయంతి సందర్భంగా 2017 సెప్టెంబర్ 21వ తేదీన 
సహకార సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

లక్ష్మణ్ రావు ఇనాందార్ శతజయంతి సందర్భంగా 2017 సెప్టెంబర్ 21వ తేదీన 
సహకార సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం


దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడకు విచ్చేసిన ప్రముఖులందరూ సహకార ఉద్యమంతో అనుబంధం కలిగిన వారే.

లక్ష్మణ్ రావు ఇనాందార్ గారి శత జయంతి సందర్భంగా జరుపుకొంటున్న ఈ వేడుకలలో భాగంగా మనం ఈ రోజంతా ఇక్కడ అవుతున్నటువంటి సదస్సులో సహకార ఉద్యమానికి మరింత స్ఫూర్తిని అందించేందుకు అవసరమైన మార్గాలను గురించి సమగ్రంగా చర్చించనున్నాం. సామాన్య ప్రజల సమస్యలను సమష్టిగా పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించడం కోసం కొత్త శక్తిని పెంపొందించుకొందాం. సమాజం పట్ల మరింత జాగరూకతతో వ్యవహరిద్దాం. సహకారం ద్వారా, సహకార సంస్థల ద్వారా సమస్యలకు పరిష్కారాలను అన్వేషిద్దాం.

గొప్ప వ్యక్తులను రూపొందించడంలో మన దేశం ఎంతో ఫలవంతమైంది. తమ జీవితకాలంలో సమాజం కోసం జీవిస్తూ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే మనుషులు ప్రతి యుగంలో, ప్రతి ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు.

గత చరిత్రను పరిశీలించినా, ప్రస్తుత కాలాన్ని పరిశీలించినా, సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మనుషులంటూ లేని ప్రాంతం ఏదీ లేదు. అనేక మంది వ్యక్తులు వారి జీవిత కాలంలో ప్రజలలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన వ్యక్తులుగా టెలివిజన్ లో, వార్తాపత్రికలలో వివిధ రకాల ప్రచారం ద్వారా, అలాగే వారు పొందిన సత్కారాల ద్వారా పేరు తెచ్చుకొంటూనే ఉన్నారు. వారిని గురించి మనం చర్చించుకొంటూనే ఉన్నాము. తద్వారా వారు జీవితంలో ఒక గొప్ప వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. అయినప్పటికీ ఇంత విశాలమైన దేశంలో అటువంటి వ్యక్తులు చాలా మంది వార్తాపత్రికలలో పతాక శీర్షికలలో కనబడడం లేదు. ఆకర్షణీయమైన టెలివిజన్ తెర మీద ఎప్పుడూ మనకు దర్శనం ఇవ్వడం లేదు. వారు ఎప్పుడూ ప్రశంసలకు, గుర్తింపునకు లేదా పురస్కారాలకు నోచుకోవడం లేదు. అయితే వారు ఒక అజ్ఞాత కార్మికునిగా తమ జీవితాలను ప్రజా సేవకు అంకితం చేసుకొంటున్నారు. ఒక దీపం మరో దీపాన్ని, ఆ దీపం వేల వేల దీపాలను వెలిగించిన విధంగా వారు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి వారి ఆశయాల కోసం, విలువలకు కోసం శరీరాలను, జీవితాలను త్యాగం చేస్తారు. దేశం కోసం అజ్ఞాతంగా వారు అందించిన సేవలు అమూల్యమైనవి; అటువంటి వ్యక్తుల్లో వకీల్ సాహెబ్ ఒకరు.

ఈ రోజు కొంత మంది ఆశ్చర్యపోవచ్చు.. మనలో చాలా మంది ఆయన పేరునైనా ఎప్పుడూ విని ఉండక పోవచ్చు. అయినా మనం ఈ రోజు ఆయన శత జయంతి వేడుకలను జరుపుకొంన్నాం. అయన పేరును మీరు వినలేదు అంటే, నేను ఒప్పుకుంటాను. అయితే, ఆయనలో ఉన్న గొప్పతనం, ప్రత్యేకత అవే. తనకు తాను అజ్ఞాతంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ప్రజలను సమీకరించి, వారితో కలిసి మెలిసి పనిచేయడమే సహకార ఉద్యమం విజయానికి ప్రాథమిక సూత్రం అని నేను నమ్ముతాను. సహకార స్ఫూర్తికి ఇదే చాలా ముఖ్యమైన అంశం.

ప్రజల అభివృద్ధి కోసమే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అదే దేశాభివృద్ధికి ఒక మార్గంగా ఆయన కనుగొన్నారు. నా జీవితంలో కొంత కాలం ఆయనతో గడిపే అవకాశం లభించడం నేను చేసుకొన్న అదృష్టం. నా యుక్త వయస్సులో అనేక సంవత్సరాలు ఆయన మార్గదర్సకత్వంలో గడిపాను. అందువల్లే ఆయన జీవితం నాకు నిరంతరమైన ప్రేరణగా నిలచింది. అప్పుడే నేను ఆయన జీవిత చరిత్రను రాశాను; ఇది సుమారు 25- 30 ఏళ్ల కిందటి సంగతి.

ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఆయన జీవిత విశేషాలను తెలుసుకుంటున్న కొద్దీ నేను ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. నేను అనేక సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించాను. అయినా ఆయన గురించి అనేక విషయాలు ఆయన మరణానంతరమే నేను తెలుసుకోగలిగాను. ఆయన ఏ విధంగా తన జీవితాన్ని గడిపారో తెలుసుకోవడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. వినయ విధేయత లతో కూడిన జీవితాన్ని గడపాలనే గొప్ప సంప్రదాయంతో ఆయన ఒక రత్నంలా పని చేశారు. వెలుగులోకి రాకుండా, ప్రచారానికి దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ తన సహచరుల అభివృద్ధి కోసం, వారి సామర్ధ్యాలను పటిష్ఠపరచడం కోసం తన ఆశయాలకు, ఆలోచనలకు మరింత బలం చేకూరే విధంగా ఆయన నిరంతరం శ్రమించే వారు.

ఆయన శత జయంతిని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సహకార ఉద్యమం ఒక కొత్త బలాన్ని సంతరించుకొంటుంది. ఆయన శత జయంతి సందర్భంగా సహకార ఉద్యమానికి ఆయన చేసిన సేవలను గురించి ఈ రోజు మనం తలచుకుందాం. తద్వారా సహకార రంగంలో ఉత్తమ అంతర్జాతీయ విధానాలను గురించి చర్చించుకొందాం.

సహకార సంఘాల ద్వారా వ్యవసాయ రంగంలో ఏ విధంగా పురోగతిని సాధించగలం ? 2022 కల్లా మన రైతుల ఆదాయాన్ని ఏవిధంగా రెట్టింపు చేయాలి ? మన గ్రామీణ జీవన విధానాన్ని, మన వ్యవసాయాన్ని ఆధునిక భారతదేశం అవసరాలకు అనుగుణంగా మలచుకోడానికి ఎటువంటి మంచి విధానాలను అవలంబించాలి ? ఎటువంటి చెడు పద్దతులను విడనాడాలి ? అదే విధంగా అభివృద్ధి దిశగా వారిని ఏవిధంగా సమాయత్త పరచాలి ? ఒక వైపు నగరాలు అభివృద్ధి చెందుతుండగా, మరొక వైపు గ్రామాలు వెనుకబడడం సమాజసం కాదు. సమతులమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకోవాలి. అభివృద్ధిలో సమానావకాశాలను కల్పించాలి. సమతుల్య అభివృద్ధికీ, సమానా వకాశాలకు సమష్టి కృషి అనేది ప్రాథమిక అంశం. కాలం గడుస్తున్న కొద్దీ వ్యవస్థలో లోపాలు తలెత్తుతూ ఉంటాయి. కొన్ని విధానాలకు సమయం మించిపోవచ్చు.

సహకార సంస్థలలో ఉన్న ప్రతి వ్యక్తీ ఈ సమస్యలపై దృష్టి సారించాలి. సహకార సంస్థ ఒక నిర్మాణాత్మకమైన, ఒక చట్టపరమైన విధానమని, కొన్ని నియమనిబంధనల క్రింద రాజ్యాంగబద్ధంగా ఇది ఏర్పాటైందని- ఇలా ఒక చట్రంలో మనం ఊహించుకున్నట్లైతే మనం కూడా ఒక సహకార సంస్థలా తయారైపోతాం. నా దృష్టిలో ఇది ఒక పెద్ద తప్పు.

ఇంత పెద్ద దేశంలో విధానాలు అవసరమే; నియమ నిబంధనలు అవసరమే; చేయదగినవి, చేయకూడనివి కూడా అవసరమే; ఇది చాలా అత్యవసరం కూడా. అయితే, సహకార సంస్థలు కేవలం ఈ విధానాలపై పని చేయవు. సహకార సంస్థ అనేది ఒక స్ఫూర్తి. ఇది ఒక వ్యవస్థ కాదు. ఇది ఒక స్ఫూర్తి. అలాగే ఈ స్ఫూర్తికి విలువలు కూడా ముఖ్యం. అందుకే ఇనాందార్ గారు అనేక సార్లు విలువలు లేనిదే సహకార సంస్థ ఉండజాలదనే విషయాన్ని వల్లించే వారు.

వ్యవస్థలో ఇప్పుడు ఆ స్ఫూర్తి ఎక్కడో కనుమరుగైనట్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. సహకార స్ఫూర్తిని తిరిగి పొందడానికి వకీల్ సాహెబ్ కంటే పెద్ద ప్రేరణను మనం ఎక్కడ నుండైనా పొందగలమా ? ఈ సహకార స్ఫూర్తికి ఎక్కువ శక్తిని అందించగలిగితే, అప్పుడు వ్యవస్థలో ఉన్న లోపాలను సైతం మనం సవరించగలుగుతాం.

మన దేశంలో యావత్తు సహకార ఉద్యమానికి గ్రామాలే ఆధారం. ఇదే నియమ నిబంధనలలో భాగంగా పట్టణ సహకార సంస్థలు అభివృద్ధి చెందడం ప్రారంభించాక, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో అది కూడా పట్టణ ప్రాంతాలలో ఒక విధమైన మార్పులు చోటు చేసుకొన్నాయన్న వాస్తవాన్ని మనం కాదనలేం. అదే సమయంలో ఒక పద్ధతి ప్రకారం విచ్ఛిన్నం కావడం కూడా మొదలైంది. దాంతో గందరగోళం, అనుమానాలు పెరిగాయి. ఈ రోజుకు కూడా గ్రామీణ జీవితంతో ముడిపడిన సహకార ఉద్యమంలో ఒక విధమైన పవిత్రతను మనం గమనించవచ్చు.

ఈ విధానం తమకు ఎంతో సరైన మార్గమని రైతులు కూడా భావిస్తారు. సహకార ఉద్యమంలో ఎవరైతే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారో, వారు తమ గ్రామానికి, పేద రైతులకు ఈ వ్యవస్థ ద్వారా ఎంతో కొంత మేలు చేయగలిగామని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఈ విషయాలన్నింటినీ ఈ రోజు చేర్చించనున్నారు. నా మనస్సులో ఒక చిన్న అంశం ఉంది. దానిని గురించి మీతో చెప్పాలనుకొంటున్నాను. మీరు ఈ విషయాన్ని తప్పక చర్చిస్తారని భావిస్తాను.

భారతీయ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఒక్క విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. మన రైతు చిల్లర ధరకు కొనుగోలు చేస్తున్నాడు; టోకు ధరకు విక్రయిస్తున్నాడు. దీనిని మనం తిరగేసి- అంటే టోకు ధరలో కొనుగోలు చేసి, చిల్లర ధరకు విక్రయిస్తే ? అప్పుడు ఎవరు కూడా అతనిని దోపిడీకి గురి చేయలేరు. ఏ మధ్యవర్తి కూడా తన ప్రయోజనం కోసం అతనిని అవకాశంగా తీసుకోలేడు. పాడి పరిశ్రమను, మరీ ముఖ్యంగా సహకార పాడి పరిశ్రమను అధ్యయనం చేసిన వారు, దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. ఇది ఒక ప్రత్యేకమైన, వినూత్నమైన విధానం. ఈ పద్ధతిలో రైతు కొనుగోలు, విక్రయాలను టోకు ధరలోనే చేస్తారు. రైతు కొనుగోలు, విక్రయాలను టోకు ధరలకే చేయడం అనే వినూత్నమైన విధానమే పాడి పరిశ్రమ విజయానికి ప్రాథమిక సూత్రం గా నిలచిందన్న విషయాన్ని మీరు గమనించండి. ఎందువల్ల ? గతంలో రైతు తాను సేకరించిన 10 లీటర్ల పాలను 10 ఇళ్లకు వెళ్లి విక్రయించేవాడు. అయితే ఇప్పుడు ఆ రైతు ఆ 10 లీటర్ల పాలను పాల సేకరణ కేంద్రానికి వెళ్లి విక్రయిస్తున్నాడు. దీనర్థం, అతడు టోకు విపణిలో అమ్ముతున్నాడు అని. అలాగే అతడు కొనుగోళ్లు చేయాలనుకొంటే ఆ పనిని, తన పశువులకు దాణాను, వాటికి మందులను కూడా పాల కేంద్రం ద్వారానే పూర్తి చేస్తున్నాడు. ఒకవేళ అతడి పశుగణానికి సంరక్షణ అవసరపడితే అటువంటప్పుడు ఈ సదుపాయాలన్నీ కూడా మొత్తం గ్రామానికి అవసరమైన అన్ని సదుపాయాలను ఉమ్మడిగా సమకూర్చడం జరుగుతోంది.

దీనివల్ల పాల కేంద్రం నుండి రైతు మరికొన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందుతున్నాడు. అతడి ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి. అది అదనపు ఆదాయ వనరుగా కూడా అవుతున్నది. వేరే ప్రతి ఒక్క రంగంలోనూ అతడికి ఒక ఇబ్బంది ఎదురవుతుంది. చూడండి.. అతడు గనక ప్రయివేటు రంగం లోని వారికి టోకు ధరలో పాలను విక్రయించినట్లయితే, అతడికి ఈ విధమైన ఆదాయం లభించేది కాదు. సహకార రంగంలో ఉన్నందువల్ల అది అతని ఆదాయానికి మూలాధారమైంది. ఇటువంటి సహకార ఉద్యమాన్ని మరొకదానిని మనం ప్రారంభించగలమా ? ఒకటి మన సంప్రదాయం ప్రకారం ఇప్పటికే ఉంది.. ఇంతకు ముందు అక్కడ ఐదు సహకార సంఘాలు ఉన్నాయి. వాటిని అక్కడి ప్రజలే నిర్వహిస్తున్నారు. నేను వారికి చూపిస్తాను, ఆరో దానిని నేను తయారు చేస్తాను. సహకార సంస్థల రూపంలో ఒక కొత్త విధానం ఉంది. ఇప్పుడున్న ఐదింటిని కొనసాగించాలనుకుంటే వారిని నిర్వహించుకోమనండి. అయితే ఎవరు ఏమి చేయని మరో పది రంగాలు ఉన్నాయి. అయితే సహకార వ్యవస్థ ద్వారా ఆయా రంగాల సమస్యలను మనం పరిష్కరించలేమా ? నేను చేయగలనా ? సహకార సంస్థలు తాకనటువంటి రంగాలు అనేకం ఉన్నాయి. వాటిని కూడా సహకార వ్యవస్థ పరిధి లోకి తీసుకు వస్తే అప్పుడు పోటీ తీవ్రంగా ఉంటుంది. అది చక్కెర కావచ్చు, పాలు కావచ్చు, అప్పుడు పోటీ అధికంగా ఉంటుంది. ఎక్కడైతే కొంత ప్రయోజనం ఉంటుందో, అక్కడ పోటీ కూడా ఉండటం స్వాభావికం. అయితే చాలా రంగాలలో -మొత్తం ఒక తరం అంతా కూడాను అంకిత భావంతో కష్టపడితేనే- సహకార సంస్థ బలోపేతం కాగలదు.

ప్రాథమికంగా గ్రామీణ జీవితాలలో మార్పును తీసుకు రావడానికి- ఒక కొత్త స్ఫూర్తి తో – కొత్త తరాన్ని సహకార ఉద్యమం లోకి వచ్చేలా మనం ప్రేరేపించగలమా ? మన దేశంలో పరివర్తనను తీసుకురావడానికి సహకార ఉద్యమం పూర్తిగా అనువుగా ఉంటుంది.

ఇది ఎక్కడి నుండో అరువు తెచ్చుకున్న ఆలోచన కాదు; ఇది మన ప్రాథమిక ఆలోచనా విధానానికి, మన ప్రాథమిక విలువలకు పూర్తిగా అనువుగా ఉంటుంది. అందువల్ల ఇది ఇక్కడ సహజంగా ఉద్భవించిన ఆలోచన. ఇందుకోసం మీకు మీరుగా దీనిని ఆపాదించుకోవలసిన అవసరం లేదు. ఇతర అన్ని విధానాలనూ వాటిని మనం ఆచరించాలంటే అవి అరువు తెచ్చుకున్న విధానాలు. అందువల్ల కొంత అవరోధం ఉంటుంది. ఇది మన సహజ సిద్దమైన, ఎప్పుడూ ఆచరించే విధానం కాబట్టి మనమందరం ఉమ్మడిగా ఆచరించవచ్చు.

ఉదాహరణకు, ఈ రోజున మనం వేప పూత యూరియాను వాడుతున్నాం. దీని ద్వారా రైతులు అపారంగా ప్రయోజనం పొందారు. దీనివల్ల యూరియా పొందడానికి పడే కష్టాలు తొలగిపోయాయి. అయితే యూరియా పై పూత కోసం వేప గింజలను సేకరించడం, వాటిని సేకరించిన తరువాత నూనెను తీయడం, తీసిన నూనెను యూరియా కర్మాగారానికి సరఫరా చేయడం మొదలైనవన్నీ కొత్తగా చేయవలసిన పెద్ద పనులు. మన గ్రామీణ మహిళలు సహకార సంఘాలుగా ఏర్పడి వేప పూతకు అవసరమైన వేప గింజలను వేప చెట్లు అధికంగా ఉండే అటవీ ప్రాంతాల నుండి సేకరించగలిగితే, అప్పుడు అది ఒక కొత్త పారిశ్రామిక రంగానికి నాంది పలుకుతుంది. ఒక కొత్త సహకార సంఘాన్ని స్థాపించవచ్చు.

పాడి పశువులను పెంచుకొనేటట్లు రైతులను ప్రోత్సహించవలసిందిగా పాడి పరిశ్రమ ఉన్న నా స్నేహితులందరినీ నేను తరచూ కోరుతూ ఉంటాను. అయితే, ఇందుకోసం వారిని గట్టిగా ఒత్తిడి చేయాలి. తేనెటీగల పెంపకం విషయంలో కూడా వారిని ప్రోత్సహించాలి. తేనె ఉత్పత్తి రంగంలో మనం ఒక విప్లవాన్ని తీసుకురావాలి. అంటే, దేశంలో ఒక తీపి విప్లవాన్ని తీసుకురావాలి. ఈ తేనె విప్లవాన్ని సహకార సంఘాల ద్వారా తీసుకురావచ్చు. పాడి పశువులను, పాల ఉత్పత్తిలో రైతులు ఏవిధంగా నిమగ్నమై ఉంటున్నారో అదే విధంగా రైతు 50 తేనెటీగలను పెంచి, సంవత్సరానికి 1.5 లక్షల రూపాయల నుండి 2 లక్షల రూపాయల మేర ఆదాయాన్ని సులువుగా వృద్ధి చేసుకోవచ్చు. రోజూ పాలను ఏ విధంగా సేకరిస్తున్నారో అదే విధంగా వారు తేనెను కూడా సేకరించవచ్చు. పాలను పాల కర్మాగారంలో ఏ విధంగా శుద్ధి చేస్తారో, అదే మాదిరిగా తేనెను కూడా శుద్ధి చేయవచ్చు. తేనెకు కూడా మంచి విపణి ఉంది. రసాయనిక క్రొవ్వు గూడులను కూడా కిలో 100 రూపాయల చొప్పున విక్రయించవచ్చు. తేనెటీగలను కూడా కిలో రూ.400- రూ.450కు విక్రయించవచ్చు. వీటికి విపణిలో బోలెడంత గిరాకీ ఉంది. భారతదేశంలో కూడా వీటికి పెద్ద విపణి ఉంది. అయితే, ఈ రోజుకు కూడా మన రైతులు ఈ డిమాండ్ ను చేరుకోలేక పోతున్నారు. వందల రకాల తేనెటీగలు ఉన్నాయి. అవి పంటలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. తేనెటీగ ఒక రాయబారిలా పని చేస్తుంది. పండ్ల తోటల్లో పనిచేసే వారికి కూడా తేనెటీగలు అనేక విధాలుగా సహాయపడుతూ ఉంటాయి. నేను చెప్పదలచుకొన్నది ఏమిటంటే, మనకు ఎన్నో కొత్త ప్రాంతాలు ఉన్నాయి. అయితే, ఆ యా రంగాలలో మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేదే మనం ఆలోచించాలి.

తీర ప్రాంతాలలో మత్స్యకారులుగా జీవనం గడుపుతున్న మన సోదర సోదరీమణుల పని వాతావరణం కారణంగా సంవత్సరంలో సుమారు 5 నెలలు నిలచిపోతుంది. వర్షాకాలంలో సముద్రం లోకి వెళ్లడం చాలా ప్రమాదకరం. అందువల్ల ఆ సమయంలో వారి పని ఆగిపోతుంది. అయితే Sea Weed farming మన దేశంలో ప్రచారంలో లేదు. మన మత్స్యకార సోదరులు సహకార ఉద్యమం ద్వారా ఈ sea-weeds పెంపకాన్ని చేపడితే అవి ఔషధ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ప్రయోగ ఫలితాలు రుజువు చేశాయి. ఒక వేళ ఈ సీ వీడ్స్ కు సరైన విపణి లభించకపోతే, దీనికి 45 రోజుల జీవిత చక్రం ఉంది. ఈ sea-weeds (సముడ్రపు మొక్కలు) సముద్రంలో ప్రతి 45 రోజులకు ఒకసారి చేతికి వస్తాయి. సముద్రంలో మనం 45 రోజుల పాటు సీ వీడ్ ఫార్మ్స్ వేసినట్లయితే మనకు ప్రతి రోజు పంట చేతికి వస్తుంది. నీవు ఏమీ చేయనక్కర లేదు.. వీటి రసాన్ని తీసి, ఆ రసాన్ని పొలాల్లో చల్లవచ్చు. ఈ సముద్రపు మొక్కల రసాన్ని ఉపయోగించడం ద్వారా భూమిని కాపాడుకోవడానికి చాలా పెద్ద విపణి ఉంది. మనం పెద్దగా ఏమీ చేయనవసరం లేదు; కష్టపడనక్కర లేదు. సహకార ఉద్యమం ద్వారా తీరా ప్రాంతాల్లో నివసిస్తూ సుమారు 5 నెలలు పని నిలచిపోయే మత్స్యకార సోదరుల కోసం ఈ అవకాశాన్ని మనం కల్పించవచ్చు. వారి కుటుంబాల్లోని మహిళలు ఈ పనిచేయడానికి రాత్రి పగలూ అందుబాటులో ఉంటారు. నేను చెప్పదలచుకొన్నది ఏమిటంటే, దేశంలో సహకార ఉద్యమం ఇటువంటి చిన్న చిన్న పనుల ద్వారా మన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో పెద్ద పెద్ద మార్పులను తీసుకురాగలుగుతుందీ అని.

ఈ రోజు ఇక్కడ హాజరైన సహకార ఉద్యమ రంగంలోని మన స్నేహితులు ఈ ఉద్యమానికి మరింత ప్రచారం కల్పించవలసిందని నేను కోరుతున్నాను. మరింత మంది ప్రజలు సహకార ఉద్యమం పట్ల ఆకర్షించబడేలా చూడాలి. వకీల్ సాహెబ్ భావాలకు అనుగుణంగా సామాన్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించి, వారి అభ్యున్నతికి దోహదపడేలా ఈ సహకార ఉద్యమ స్ఫూర్తిని మరింత ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను.

ఈ ఒకే ఆశతో, వకీల్ సాహెబ్ పవిత్ర జ్ఞాపకాలతో, మీకు అందరికీ ఇవే నా శుభాభినందనలు.

ధన్యవాదాలు.

***