Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి ప్రణామాలు


లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు.

“మహనీయుడైన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అనేక మందికి స్వాతంత్ర్య సమరంలో తమను తాము అర్పితం చేసుకొనేటట్లు ప్రేరణ కలిగించారు. ఆయన జయంతి సందర్భంగా తనకు నేను నమస్కరిస్తున్నాను.

లోకమాన్య తిలక్ ప్రయత్నాలు ప్రజలలో ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రజలలో నిండిన ఈ ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాస భావాలే భారతదేశం చరిత్రను సృష్టించడానికి ఎంతగానో తోడ్పడ్డాయి” అని ప్రధాన మంత్రి అన్నారు.