Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వడోదరా లో ప్రధాన మంత్రి

వడోదరా లో ప్రధాన మంత్రివడోదరా లో ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు వడోదరా విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ లో- మరీ ముఖ్యంగా- పర్యటన రంగంలో గగనతల అనుసంధానానికి ఉన్న ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. విమానయాన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిందని, ఈ విధానంలో ఈ రంగం భావి దిశ, ముందుముందు ఈ రంగం వృద్ధి గురించి పేర్కొన్నరని ఆయన అన్నారు.

వడోదరా విమానాశ్రయం ఇప్పుడిక దేశంలో కోచి తరువాత రెండవ పర్యావరణ మిత్రపూర్వకమైన విమానాశ్రయంగా రూపుదిద్దుకొందని ప్రధాన మంత్రి తెలిపారు.

దివ్యాంగులకు సహాయక పరికరాలను పంపిణీ చేసిన అనంతరం ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలను నెలకొల్పేటప్పుడు దివ్యాంగుల అవసరాలను ఎల్లప్పటికీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలు లక్షిత లబ్ధిదారులకు అందేటట్లు చూడడానికి అత్యంత ఉన్నతమైన ప్రాధాన్యాన్ని కట్టబెట్టిందని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పనితీరులో దళితులు, అణగారిన వర్గాల వారి కోసం చేపట్టే కార్యక్రమాలకు కేంద్ర స్థానాన్ని కల్పిస్తున్నామని ఆయన అన్నారు.

పేదరికం, అవిద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి అభివృద్ధే కీలకం అని ప్రధాన మంత్రి తెలిపారు.