Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వరల్డ్ అండ‌ర్ 20 చాంపియ‌న్ శిప్స్ లో 400 మీట‌ర్ల విభాగంలో స్వ‌ర్ణం గెలుచుకొన్నందుకు హిమా దాస్ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


వరల్డ్ అండ‌ర్ 20 చాంపియ‌న్ శిప్స్ లో 400 మీట‌ర్ల పరుగుపందెం విభాగం లో స్వ‌ర్ణం గెలుచుకొన్నందుకు క్రీడాకారిణి హిమా దాస్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

“వరల్డ్ అండ‌ర్ 20 చాంపియ‌న్ శిప్స్ లో 400 మీట‌ర్ల పరుగుపందెం విభాగం లో చ‌రిత్రాత్మ‌క‌మైనటువంటి స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్న క్రీడాకారిణి హిమా దాస్ ను చూసి భార‌త‌దేశం సంతోషిస్తోంది; మరి అలాగే గ‌ర్విస్తోంది కూడాను. ఆమె కు ఇవే అభినంద‌న‌లు. ఈ సాఫ‌ల్యం రానున్న సంత్స‌రాల‌లో యువ క్రీడాకారిణుల‌కు మరియు యువ క్రీడాకారుల‌కు ప్రేర‌ణ‌ ను అందించడం తథ్యం” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

*****