Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాద్ రాడ్ లో సెంట‌ర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ ఫ‌ర్ వెజిట‌బుల్స్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ, ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ


గుజ‌రాత్ లోని సాబ‌ర్ కాంఠా జిల్లాలో వాద్ రాడ్ లో సెంట‌ర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ ఫ‌ర్ వెజిట‌బుల్స్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ ఈ రోజు సంద‌ర్శించారు.

ఈ కేంద్రం సాధించిన వివిధ విజ‌యాల‌ను వారి దృష్టికి తీసుకు రావ‌డ‌మైంది. క‌చ్ జిల్లా కుకామా లో సెంట‌ర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ ఫ‌ర్ డేట్ పామ్స్ ను వారు వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. వారు క‌చ్ఛ్ జిల్లా కు చెందిన వ్య‌వ‌సాయ‌దారుల‌తో సంభాషించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ వ్య‌వ‌సాయ రంగాన్ని కేంద్ర బిందువుగా తీసుకొని ఒక దేశాన్ని ఏ విధంగా పరివర్తన చెందించవచ్చో ఇజ్రాయ‌ల్ మార్గాన్ని చూపించింద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగంలో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం ముఖ్యమని ఆయ‌న పేర్కొన్నారు. 2022 వ సంవ‌త్స‌రం క‌ల్లా రైతుల ఆదాయాల‌ను రెట్టింపు చేసే దిశ‌గా భార‌త‌దేశం ఏ విధంగా కృషి చేస్తున్న‌దీ ఆయ‌న వివ‌రించారు. సేద్యంలో నీటిపారుద‌ల మ‌రియు వినూత్న ప‌ద్ధ‌తులపై శ్ర‌ద్ధ వ‌హించ‌డం ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు.

******