పిఎంఇండియా
మాతృమూర్తులు, సోదరీమణులు, సోదరులు మరియు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేసినటువంటి నా యువ మిత్రులారా,
బనారస్ లో పలు అభివృద్ధి ప్రోజెక్టులకు పునాదిరాళ్లను వేసే అవకాశం నాకు లభించిన భాగ్య శీలి ని నేను. ప్రప్రథమంగా, బనారస్ ప్రజలకు నేను ధన్యవాదాలను తెలియజేసి వారిని అభినందించాలనుకొంటున్నాను. ఈ రోజున, బనారస్ పౌరులు ఒక అద్భుతమైన పని ని చేశారు. ఫ్రాన్స్ ప్రజలు తమ దేశాధ్యక్షుడి కి భవ్యమైన విధంగా స్వాగతం పలికిన బనారస్ ను గురించి తప్పక అడిగి తెలుసుకొంటారు.
మేము త్వరగా ముందుకు కదలి ఉండకపోతే, మా కారు రహదారి మధ్యలో చిక్కుకొని ఉండేది; మరి, మేము రహదారి మార్గంలో ఇప్పటికీ ప్రజల నుండి అభినందనలను అందుకొంటూనే ఉండే వాళ్ళం. అంత భారీగా జనం పోగయ్యారు. గంగా ఘాట్ మరియు బనారస్ భూమి యొక్క దృశ్యాలను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. బనారస్ ప్రజలు వర్షించినటువంటి ప్రేమ మరియు ఆశీస్సులు భారతదేశానికి, ఫ్రాన్స్ కు మధ్య ఉన్నటువంటి మైత్రిని పటిష్టపరచాయి. ఇందుకుగాను బనారస్ ప్రజలకు ధన్యవాదాలు తెలపకుండా ఉండబట్టలేకపోతున్నాను.
వింధ్యవాసిని మాత కు శిరస్సు ను వంచి నమస్కరించే మంచి అదృష్టానికి కూడా నేను నోచుకొన్నాను. ప్రపంచ వ్యాప్తంగా సౌర శక్తి ఉద్యమాన్ని నడపడం లో భారతదేశం ఒక కీలక పాత్ర ను పోషిస్తోంది. సౌర శక్తి రంగంలో ఫ్రాన్స్, భారతదేశాలు కలసి విశేషంగా కృషి చేస్తున్నాయి. వివిధ దేశాల నుండి అతిథులు నిన్న ఢిల్లీ కి తరలివచ్చారు; మరి, వారు సౌర శక్తి ని అభివృద్ధిపరచే దిశగా పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకొన్నారు. మిర్జాపుర్ లో ఒక సౌర విద్యుత్తు ప్లాంటు ను ప్రారంభించే అవకాశం కూడా నాకు దక్కింది. భారతదేశం లో భారీ మార్పు దిశగా ఈ ప్రచారం జరుగుతోంది. దీనిని మరింత ముందుకు తీసుకుపోయి, ప్రతి ఇంటి పైనా సౌర ఫలకాలను అమర్చుకొనేటట్టు చేయాలన్నది నా కోరిక. అప్పుడు ఇంట్లో వంట స్టవ్ అవసరం ఉండదు. ఎటువంటి ఆర్ధిక భారం, పర్యావరణ వ్యయం లేకుండా సులభంగా ఆహారాన్ని వండుకోవచ్చు. పరిశుభ్రమైన వంటకు ఇది ఒక పెద్ద ప్రచారంగా నిలుస్తుంది.
భారతదేశంలో 25 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అందువల్ల, దీనికి భారీ విపణి ఉంది. మన మాతృమూర్తులు, సోదరీమణులు ఆహారం వండడానికి తోడ్పడేటటువంటి సాంకేతికతలను మరియు నూతన ఆవిష్కరణలను కనుగొనడంలో పోటీపడవలసిందిగా ఐఐటీ లలో విద్యను అభ్యసించిన నా యువ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఇంధనంపై ఎటువంటి ఖర్చు ను పెట్టకుండా సూర్య భగవానుని ఆశీస్సులతో సౌకర్యవంతంగా వంట చేయగలగాలి. పేద కుటుంబాలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక గొప్ప సేవ కాగలదు.
పైపెచ్చు, ఇవాళ కాశీని, పట్నా ను కలుపుతూ ఒక కొత్త రైల్వే సర్వీసు ను ప్రారంభించే అవకాశం కూడా నాకు దక్కింది. కాశీ ని, పట్నా ను కలుపుతూ వేగంగా వెళ్లే ఒక రైలు సర్వీసు కావాలన్నది ఎప్పటి నుండో ఉన్న కోరిక. ఈ రైలు కాశీ లో ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు గాని, లేదా 10 గంటల 15 నిముషాలకు గాని పట్నాకు చేరుకొంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంకాలం 5 గంటలకు పట్నా లో బయలుదేరి, రాత్రి 9 గంటలకు గాని, లేదా 9గంటల 30 నిమిషాలకో, 10 గంటలకో కాశీ కి వస్తుంది. కాశీ, పట్నా స్టేషన్ ల మధ్య అతి వేగంగా నడిచే ఈ కాశీ- పట్నా ‘‘జనశతాబ్ది ఎక్స్ ప్రెస్’’ రైలు ను ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. రైల్వే మంత్రి ని నేను అభినందిస్తున్నాను. ప్రజల సంక్షేమం కోసం శ్రీ మనోజ్ సిన్హా నాయకత్వంలో ఇంకా అనేక పనులు కొనసాగుతున్నాయి.
కాశీ ఇప్పుడు నా రెండో ఇల్లు అయిపోయింది. ఆధ్యాత్మికత పరంగా కాశీ పట్టణం హర హర మహాదేవ్ తో గుర్తింపును పొందగా, పారిశ్రామికంగా కాశీ పట్టణం డిఎల్ డబ్ల్యు తో గుర్తింపు ను పొందింది. అందువల్ల, భారతప్రభుత్వం డిఎల్ డబ్ల్యు కు అవసరమైన సదుపాయాలను కల్పించే దిశగా చర్యలను తీసుకొంటోంది. ఎందుకంటే, డిఎల్ డబ్ల్యు అభివృద్ధి, విస్తరణ, ఆధునీకరణ లు ఎక్కువ మందికి మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
ఇటీవలే మనం హోలీ పండుగ ను జరుపుకొన్నాం. 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ హోలీ పండుగకు కొత్త రంగులను, కొత్త పరిమళాన్ని, కొత్త ఆశను జోడించాయి. ఇక్కడ ఉన్న పేద కుటుంబాలకు వారి ఇంటి తాళం చెవులను అందించే అవకాశం ఈ రోజు నాకు దొరికింది. ఇంతకు ముందు మీరు ఎక్కడ ఉండే వారు ? అని నేను వారిని అడిగాను. కొంతమంది పూరి గుడిసెలలో ఉన్నారు; మరి కొంతమంది మురికివాడలల ఉండే వారు, కొంతమంది ఒక బెడ్డింగు తో తరచుగా ఒక చోటు నుండి మరొక చోటు కు మారుతూ ఉండే వారు. వారి జీవితాలు అలా ఉండేవి. ఈ ఇల్లు వచ్చినందుకు మీరు సంతోషంగా ఉన్నారా ? లేరా ? ఏదైనా కోల్పోయినట్లు అనిపిస్తోంది ? వంటి అనేక ప్రశ్నలు వారిని అడిగాను. మీ పిల్లలను చదివిస్తారా అని కూడా వారిని ఆ తరువాత అడిగాను. ఈ ప్రశ్నను వినగానే వారు అదోలా చూశారు. మీకు ఒక మంచి ఇల్లు ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మీ పిల్లలను చదివించడం మీ బాధ్యత అని నేను వారికి విజ్ఞప్తి చేశాను.
ఈ గృహ నిర్మాణ పథకాన్ని యోగి గారు ఒక ఉద్యమంలా అమలుచేయడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇది భారత ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పథకం కాదు. పాత ప్రభుత్వ హయాంలో కూడా ఈ పథకం అమలైంది. ఆ సమయంలో కాశీ నుండి ఈ పథకం కోసం ఒక్క పేరు కూడా నిర్ణయించలేదు, అయితే యోగి గారు లబ్ధిదారుల జాబితా ను తయారు చేసి భారత ప్రభుత్వానికి సమర్పించారు. అప్పుడు, భారత ప్రభుత్వం ఐదు నెలల కంటే తక్కువ సమయంలో ఐదు వేల కంటే ఎక్కువ గృహాలను నిర్మించి, ప్రజలకు అందజేసింది. భవిష్యత్తులో ఎనిమిది లక్షల కుటుంబాలు స్వంత గృహాలు కలిగిఉండాలన్నది మా స్వప్నం, యోగి గారి నాయకత్వంలో ఒక నిర్ణీత కాలంలో ఈ కలను సాకారం చేయడం సాధ్యం అవుతుందని నేను నమ్ముతున్నాను.
ప్రస్తుత ప్రపంచం లో మౌలిక సదుపాయాలు లేనిదే అభివృద్ధి సాధ్యం కాదు. అనుసంధానం చాలా ముఖ్యమైంది. దానికి రైళ్లు మరియు రహదారులు చాలా ముఖ్యం. శివపురి ని ఫుల్వారియా తో కలిపే నాలుగు దోవల రహదారి నిర్మాణం జరుగనుంది. రెండు రైల్వే క్రాసింగులను, రెండు కొత్త ఓవర్ బ్రిడ్జిలను దీని పైన నిర్మించనున్నారు. బనారస్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులపై చర్చిస్తున్నాము.
ఈ రోజు వ్యర్ధ పదార్ధాల ఉత్సవానికి హాజరయ్యే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు వ్యర్ధాల ఉత్సవాన్ని కూడా జరుపుకొంటున్నారా అనుకొంటూ ప్రజలు ఆశ్చర్యపోవచ్చు. చెత్త పండుగ ను ఏర్పాటు చేసినందుకు మోదీ అంటే నచ్చని వారు మోదీ ని విమర్శిస్తారు. మన స్వచ్ఛత ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. చెత్త నుండే సంపదను సృష్టించవచ్చును. చెత్త నుండే ఉపయుక్తమైన వస్తువులను తయారు చేయవచ్చును. ఇది ఒక ప్రజా ఉద్యమం అవ్వొచ్చు. వ్యర్ధ పదార్ధాల ఉత్సవం లో ఏర్పాటు చేసిన ప్రదర్శన ను తిలకించవలసిందిగా ఇక్కడ హాజరైన ప్రజలందరినీ నేను కోరుతున్నాను. బయట పడవేసిన సీసాలు, వార్తా పత్రికలతో పిల్లలు అనేక ఉపయోగకరమైన వస్తువులను తయారుచేశారు. వాటిని మీ ఇళ్లలో ప్రదర్శిస్తే వాటిని చూడడానికి ప్రజలు ఆకర్షితులు అవుతారు. వాటినే వివిధ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
ఇక్కడ నేను ఒక సంగీత కార్యక్రమాన్ని తిలకించాను. ఇది చాలా గొప్ప సంగీత కచేరీ; ఖాళీ డబ్బాలతో తయారు చేసిన సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తూ పరిశుభ్రత ను గురించి పాటలను పాడుతున్నారు. ఖాళీ డబ్బాలను వాయిస్తూ వారు అందమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఎందుకూ పనికిరాని వస్తువులను సైతం, ఎంత మంచిగా ఉపయోగించుకోవచ్చో ఈ రోజు ఈ వ్యర్ధపదార్ధాల ఉత్సవంలో నేను చూశాను.
వారాణసీ శుభ్రత కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ప్రపంచం నలు మూలల నుండి పర్యాటకులు వారాణసీ పట్ల ఆకర్షితులు అవ్వాలి. వారాణసీ లో అన్నీ ఉన్నాయి. శతాబ్దాల నుండీ ఇది ఉనికి లో ఉంది. ఈ రోజు మనం ఒకే ఒక్కటి చేయవలసి ఉంది; అది, వారాణసీ ని శుభ్రంగా ఉంచడం.
ప్రపంచం మొత్తం వారాణసీ రావాలని ప్రేరణ పొందాలి. మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంటు ను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయాలి. వ్యర్ధ జలాలను శుద్ధి చేసే ప్లాంటును 600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దీని వల్ల ప్రజలు ఎంత ప్రయోజనం పొందుతారో మనం ఇట్టే ఊహించవచ్చు.
కాశీలో వ్రేలాడుతున్న విద్యుత్తు వైరులను మీరు చూసే వుంటారు. అలా వ్రేలాడుతున్న వైరుల బారి నుండి కాశీ ని విముక్తం చేయడానికి నేను ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాను.
దేశ వ్యాప్తంగా భూమి లోపల నుండి వైరులు వేసే పని ని బనారస్ నుండి మనం ప్రారంభించాము. బనారస్ లో కూడా ఈ పని చాలా వేగంగా సాగుతోంది.
అదేవిధంగా, యోగి గారు ‘పెట్టుబడి శిఖర సమ్మేళనా’న్ని ఏర్పాటు చేసినప్పుడు, రక్షణ తయారీ కోరిడార్ ను గురించి ఆ సమయంలో నేను ప్రకటించాను. ఆ రక్షణ తయారీ కోరిడార్ కు సుమారు రెండున్నర లక్షల మంది ప్రజలకు ఉపాధి కల్పించే సామర్ధ్యం ఉంది. ఆ పనిని విస్తరించే దిశగా యోగి గారి ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి.
రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ను వహిస్తున్నందుకు నేను యోగి గారిని అభినందిస్తున్నాను. గతంలో, కనీస మద్దతు ధర ను ప్రకటించే వారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ లో వరి ని సేకరించే వారు కాదు. యోగి గారి కృషి ఫలితంగా వరి కొనుగోళ్లు నాలుగు రెట్లు పెరిగినందుకు నాకు సంతోషంగా ఉంది. తమ ఉత్పత్తులకు సరైన ధర లభించే అవకాశం రైతులకు వచ్చింది.
అంతేకాక, చెరకు రైతులకు చెల్లింపుల వేగం, పరిమాణం కూడా 40 శాతం పెరిగాయి. అంటే, కాశీ లో మౌలిక సదుపాయాల పెరుగుదలకు ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో మీరు ఊహించుకోవచ్చు. ఈ రోజు, వ్యవసాయం, విద్యుత్తు, రైల్వేల రంగాలలో అటువంటి చాలా ప్రోజెక్టులను ప్రారంభించడానికి నాకు అవకాశం వచ్చింది.
మనందరం కాశీ ని అభివృద్ధిలో నూతన శిఖరాలకు తీసుకుపోవాలి. కాశీ లోనూ, తూర్పు ఉత్తర్ ప్రదేశ్ లోనూ అనేక ప్రోజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం పనిచేస్తున్నాయి. రానున్న రోజులలో, పౌరుల కోసం మేము ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రవేశబెట్టబోతున్నాము. ‘ఆయుష్మాన్ భారత్’ లో భాగంగా పేద కుటుంబాల కోసం ఒక బీమా పథకాన్ని రూపొందిస్తున్నాము. ఒక కుటుంబం లోని ఒక వ్యక్తి ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతే, అతని కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. తన కుటుంబం పొదుపు చేసుకొన్న మొత్తం సొమ్ము ఖర్చు అవుతుందనే భయంతో సాధారణంగా ఆ పేద వ్యక్తి చికిత్స ను నిరాకరిస్తాడు. దీంతో ఆ కుటుంబం కన్న కలలు, ప్రణాళికలు చిన్నభిన్నం అవుతాయి. తనఖా పెట్టడానికి కూడా అతడి వద్ద ఏమీ ఉండక పోవడంతో, ఖర్చు పెట్టడానికి అతనికి అవకాశం ఉండదు. నా దేశ పౌరులు ఈ రకంగా బాధలు పడవలసిందేనా ?
సోదరులు మరియు సోదరీమణులారా, దీనిని నేను ఆమోదించను. అందువల్ల, ఎవరైతే చికిత్స ఖర్చు ను భరించలేరో, అటువంటి పది కోట్ల పేద కుటుంబాలు లేదా సుమారు 50 కోట్ల మంది వ్యక్తుల కోసం మేము ఒక ప్రణాళిక ను రూపొందించాము. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం లో భాగంగా, అటువంటి కుటుంబాలలో ఎవరు ఏ అనారోగ్యానికి గురి అయినప్పటికీ ఒక సంవత్సర కాలంలో వారి చికిత్సకు అయ్యే ఆసుపత్రి వ్యయాన్ని ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం మరియు బీమా కంపెనీ కలిసి భరిస్తాయి. తత్ఫలితంగా, గతంలో ఆసుపత్రికి వెళ్ళడానికి నిరాకరించే పేద వ్యక్తి, ఇప్పుడు, చిన్న చిన్న అనారోగ్యానికి కూడా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తాడు. ఎందుకంటే, తన చికిత్సకు అయ్యే ఖర్చు ను మోదీ ప్రభుత్వం భరిస్తుందని అతడికి తెలుసును కాబట్టి.
చిన్న పట్టణాలలో ప్రజలు ఆసుపత్రులకు రారని, ఒకవేళ వచ్చినా వారు డబ్బులు చెల్లించరు అనే అభిప్రాయంతో, అక్కడ ఆసుపత్రులను నెలకొల్పడానికి ప్రయివేటు సంస్థలు ముందుకు రావడం లేదు. కానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రయివేటు ఆసుపత్రులను నెలకొల్పుతున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవలను అందించే వ్యక్తులు సిద్ధమౌతున్నారు. స్వాస్థ్య సంరక్షణ రంగంలో నూతన ఉద్యోగాలు సృష్టించబడతాయి; మనం ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్ని తయారుచేయగలుగుతాము.
మన దేశంలో పోషకాహార లోపం ఒక ప్రధాన సమస్యగా ఉంది. మేము న్యూట్రిశన్ మిశన్ ను ప్రారంభించాము. రానున్న సంవత్సరాలలో మన చిన్నారుల బరువు, ఎత్తు వారి వయస్సుకు తగ్గట్టుగా ఉండేలా చూడడానికి మనం దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాము. మన చిన్నారులను పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంచడానికి ఏమి ఏర్పాట్లు చేయాలి ?, శిక్షణ కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉండాలి?, ముఖ్యంగా తల్లులకు ఎటువంటి శిక్షణ కల్పించాలి ?
ప్రధాన మంత్రి పోషణ్ మిషన్ (పిఎమ్ పిఎమ్) లో భాగంగా ఈ అంశాలన్నింటినీ పరిగణన లోకి తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో, ఈ పోషణ్ పథకాన్ని నిరుపేద కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలతో పాటు 12-14-16 ఏళ్ల వయస్సు పరిధిలో ఉన్న కుమార్తెలకు వర్తింపచేయడం జరుగుతుంది. 12-14-16 ఏళ్ల వయస్సు లో ఉన్న కుమార్తెలు ఆరోగ్యంగా, వయస్సుకు తగ్గట్టు లేకపోతే వారి శారీరిక అభివృద్ధి కూడా వారి వయస్సు కు అనుగుణంగా ఉండదు. కొన్ని సంవత్సరాల అనంతరం ఆమె తల్లి అయితే, అప్పుడు తల్లి గాని, శిశువు గాని మృతి చెందే ప్రమాదం ఉంటుంది; లేదా శిశువు ఏదో ఒక అనారోగ్యంతో జన్మించవచ్చు; అప్పుడు తల్లి జీవితమంతా ఆ శిశువుకు సేవ చేయడం తోనే సరిపెట్టుకోవలసి రావచ్చు. ఈ సమస్యల నుండి ప్రజలను విముక్తి చేయడం కోసమే, మేము ప్రధాన మంత్రి పోషణ్ అభియాన్ ను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాము.
కాశీ లో ఉన్న నా సోదరులు మరియు సోదరీమణులారా,
అభివృద్ధి ప్రయోజనాలన్నింటినీ కాశీ పొందుతుందని నేను ఆశిస్తాను. గంగానదికి సంబంధించిన అన్ని ప్రణాళికలు త్వరిత గతిన ముందుకు పోతున్నాయి; మరి, దీని తాలూకు లాభాలు కూడాను భవిష్యత్తు లో నెరవేరగలవు.
వివిధ పథకాలను వేగంగా అమలుచేస్తున్నందుకు యోగి గారి ప్రభుత్వాన్ని నేను మరొక్క మారు అభినందిస్తున్నాను. భారత ప్రభుత్వ ప్రణాళిక లను వేగంగా అమలుపరుస్తున్నందుకు ఇవే నా హృదయపూర్వక అభినందనలు. ఘన స్వాగతం పలికినందుకుగాను కాశీ వాసులకు మరొక్క పర్యాయం నా నమస్కారములు.
అనేకానేక ధన్యవాదాలు.
***
I am happy to be in Kashi and inaugurate development projects that will benefit the citizens: PM @narendramodi in Varanasi https://t.co/jGmfset4bR
— PMO India (@PMOIndia) March 12, 2018
The people of Kashi extended a very warm welcome to President @EmmanuelMacron: PM @narendramodi https://t.co/jGmfset4bR
— PMO India (@PMOIndia) March 12, 2018
A rail service that connects Kashi and Patna has been launched: PM @narendramodi https://t.co/jGmfset4bR
— PMO India (@PMOIndia) March 12, 2018
काशी और पटना को जोड़ने के लिए एक नई और तेज रेल सेवा शुरू हुई है। जनसेवा के लिए रेल का उपयोग कैसे हो, ये इसका नतीजा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
DLW काशी की औद्योगिक पहचान; भारत सरकार इसके निरंतर विकास और अपग्रेडेशन के लिए प्रतिबद्ध: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
I would like to appreciate the efforts of the @myogiadityanath-led UP Government in the housing sector and to ensure that more people get access to housing facilities: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
I went to a unique programme in Varanasi- a Kachra Mahotsav. Such festivals are vital to spread awareness on cleanliness: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
आज हम waste से wealth की दिशा में आगे बढ़ रहे हैं और कचरा महोत्सव का आयोजन इसी का प्रतीक है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
बनारस में पर्यटन की अपार संभावनाएं; यह धरती हमारे पूर्वजों की देन है और हमें इसे स्वच्छ रखना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
Ayushman Bharat is going to transform the health sector. It will provide top quality healthcare to the poor: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
‘आयुष्मान भारत’ योजना के तहत गरीब परिवारों को 5 लाख तक का अस्पताल का खर्च उपलब्ध कराया जाएगा और आरोग्य की दिशा में यह अत्यंत महत्त्वपूर्ण सिद्ध होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
हमारे बच्चे कुपोषण मुक्त हों, इसके लिए हमने प्रधानमंत्री पोषण मिशन योजना के तहत गरीब और मध्यम वर्गीय परिवार को सहयोग उपलब्ध कराने का बीड़ा उठाया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018
The @myogiadityanath-led UP Government is doing wonderful work. They are implementing schemes extremely well. I congratulate the entire team in UP: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2018