Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణ‌సీ లో నిర్మాణం లో ఉన్న ఫ్ల‌య్ ఓవ‌ర్ కూలిపోయిన కార‌ణంగా జ‌రిగిన ప్రాణ న‌ష్టం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


వారాణ‌సీ లో నిర్మాణ పనులు జరుగుతున్న దశలో ఉన్న ఫ్ల‌య్ ఓవ‌ర్ పడిపోయి, ప్రాణ న‌ష్టం వాటిల్లడం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘వారాణ‌సీ లో నిర్మాణం లో ఉన్న ఫ్ల‌య్ ఓవ‌ర్ కూలిపోయిన ఘటనలో ప్రాణ న‌ష్టం సంభవించడం అత్యంత విచార‌క‌రం. ఈ ఘ‌ట‌న లో గాయ‌ప‌డ్డ‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడిని నేను ప్రార్థిస్తున్నాను. అధికారుల‌తో నేను మాట్లాడి, బాధితుల‌కు అన్ని విధాలుగా చేత‌నైన స‌హాయం అందించవలసిందిగా సూచించాను.

వారాణ‌సీ లో నిర్మాణం లో ఉన్న ఫ్ల‌య్ ఓవ‌ర్ కూలిపోయినందువ‌ల్ల త‌లెత్తిన ప‌రిస్థితులను గురించి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ గారి తో మాట్లాడాను. ప‌రిస్థితి ని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిశితంగా ప‌ర్య‌వేక్షిస్తోంది. బాధితుల‌కు సాయం అందించ‌డానికి కృషి చేస్తోంది’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

****