పిఎంఇండియా
అప్రోప్రియేషన్ (యాక్ట్ స్) రిపీల్ బిల్- 2015 లోను, ద రిపీలింగ్ అండ్ అమెండింగ్ (థర్డ్) బిల్- 2015 లోను అధికారిక సవరణలను ప్రతిపాదించేందుకు, మరియు రాజ్య సభ వద్ద పెండింగ్ పడిన ఆయా బిల్లులను పరిశీలించేటట్లుగా చొరవ తీసుకొనేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
రద్దు చేయబడిన చాలా చట్టాలు వాస్తవానికి వాటి అర్థాన్ని కోల్పోయినప్పటికీ ఇంకా చట్టాల సంపుటిలో అలాగే ఉన్నాయి. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసినందువల్ల ఈ చట్టాల కింద తీసుకొనే చర్యలపై ఎటువంటి వ్యతిరేక ప్రభావం పడబోదు. వీటిని తొలగించటం వల్ల చట్టాల సంపుటిని ప్రక్షాళన చేయటంతో పాటు.. ఈ సంపుటి పైన ఉన్న భారాన్ని తగ్గించినట్లవుతుంది.
***