పిఎంఇండియా
విశిష్ట అతిథులు, మహిళ లు మరియు సజ్జనులు,
మిత్రులారా,
ఐఐఎం కోషిక్కోడ్ వంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ లో ‘గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్’ అంశం పై జరుగుతున్న సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నేను చాలా సంతోషం గా ఉన్నాను. అటువంటి సుపరిచిత విజ్ఞాన కేంద్రాలు ఈ తరహా అంశాల లో ఆసక్తి ని వ్యక్తం చేయడం సంతోషదాయకమైన విషయం. స్వామి వివేకానందుల వారి ఒక నిలువెత్తు విగ్రహం ఈ ప్రాంగణం లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన వేళ మనం గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్ ను గురించి మాట్లాడుకుంటూ ఉండటం యాదృశ్చికమైందేమీ కాదు. భారతదేశ అభిప్రాయాల ను ప్రపంచీకరించడం లో స్వామి వివేకానందుల వారి తోడ్పాటు ను ఎవరు మరువగలరు? 1893వ సంవత్సరం లో సెప్టెంబర్ 11వ తేదీ న శికాగో లో స్వామి వివేకానందుల వారు తాను చేసిన ప్రఖ్యాతమైన ప్రసంగం లో భారతదేశ సభ్యత తాలూకు దృశ్యాన్నొకదాని ని ఆవిష్కరించారు. ఆయన తన ఉపన్యాసాన్ని ‘‘అమెరికా లోని సోదరీమణులు మరియు సోదరులారా’’ అంటూ ప్రారంభించారో లేదో అక్కడ ఒకటే కరతాళ ధ్వనులు మారుమోగటం మనం అందరమూ ఎరుగుదుము. అది ఒక అద్భుత సన్నివేశం. ఇంద్రజాలం అనేది పదాల లో లేదు. ప్రదర్శినతమైందల్లా సార్వత్రిక సోదరభావం పట్ల భారతదేశాని కి ఉన్నటువంటి నమ్మకం, నిబద్ధత లే.
మిత్రులారా,
భారతదేశ భావజాలం వైవిధ్యభరితమైంది; హుషారైనటువంటిది కూడాను. అది నిలకడగా ఉంటూ మార్పుల కు కూడా చోటు ను ఇస్తుంది. అది ఎంత విశాలమైందంటే దాని ని ఒక ఉపన్యాసం లోనో లేదా ఒక చర్చాసభ లోనో లేదా చివర కు పుస్తకాల లో కూడా ఇమడ్చడం సాధ్యం కాదు. కానీ, స్థూలం గా చూసినప్పుడు కొన్ని ఆదర్శాలు భారతీయ విలువల కు కేంద్ర బిందువు గా మిగిలిపోయాయి. అవే కరుణ, సామరస్యం, న్యాయం, సేవ, ఇంకా దాపరికం లేకపోవడమున్నూ.
మిత్రులారా,
ప్రపంచాన్ని భారతదేశం పట్ల ఏది ఆకర్షింపచేస్తున్నదో దాని ని గురించి నన్ను మాట్లాడనీయండి. ఒకటోది మరియు సర్వ ప్రథమం అయినటువంటిది ఏమిటంటే అది శాంతి, ఏకత మరియు సౌభ్రాతృత్వ విలువ లు. బోలెడన్ని రాష్ట్రాలు, అనేకమైన భాషలు, ఎన్నో మాండలికాలు, పలు విశ్వాసాలు, బహుళమైన సంస్కృతులు, సంప్రదాయాలు, ఎన్నెన్నో ఆహారపు అలవాట్లు, మరెన్నెన్నో జీవన శైలులు, పరి పరి విధాలైన వస్త్రధారణ.. అయినప్పటి కీ మనం శతాబ్దాల తరబడి శాంతియుతం గా జీవిస్తూ వచ్చాము. వందల సంవత్సరాల పాటు మనం ప్రపంచాన్ని మన దేశం లోకి ఆహ్వానించాము. అనేక సంస్కృతులు వర్ధిల్లని కాలం లోనే మన నాగరకత వికసించింది. ఎందుకని? ఎందుకు అంటే, ఇక్కడ ఎవరైనా శాంతి ని మరియు సమృద్ధి ని పొందుతారు కనుక.
మిత్రులారా,
సులభమైనటువంటి మరియు సంబంధం పెట్టుకోదగినటువంటి అభ్యాసాల మార్గదర్శకత్వం లో మన ఆలోచన లు సజీవ సంప్రదాయాలు గా మారిపోవడం అనేది కూడా మన బలం గా ఉంటూ వచ్చింది. ఈ అభ్యాసాలు కఠినమైనవీ కాదు.. ఏక పార్శ్వం కలిగినవి కూడా కాదు. వాటి ని వేరు వేరు రీతుల లో సైతం ఆచరించే వీలు ఉండటమనే యథార్థం లోనే సుందరత నిబిడీకృతం అయివుంది.
మిత్రులారా,
ప్రపంచాని కి హిందూధర్మం, బౌద్ధం, జైనం మరియు సిఖ్ఖువాదం ల వంటి హుషారైన విశ్వాసాల ను ప్రసాదించిన దేశం మన దేశం. ఈ గడ్డ మీద సూఫీ సంప్రదాయం పుష్పించింది. వీటన్నింటి కి కేంద్ర బిందువు గా అహింస ఉంది. 20వ శతాబ్దం లో గాంధీ మహాత్ముడు ఈ ఆదర్శాల తోనే విజేత గా నిలచారు; మరి ఇది భారతదేశ స్వాతంత్య్రాని కి తోడ్పాటు ను అందించింది. అదే కాలం లో ఈ ఆదర్శాలు దేశం వెలుపల లక్షల మంది కి బలాన్ని ఇచ్చాయి. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కావచ్చు, లేదా నెల్సన్ మండేలా కావచ్చు, లేదా ఎన్నో ఆఫ్రికా దేశాల లో జరిగిన స్వాతంత్య్ర పోరాటాలు కావచ్చు.. అవి గాంధీ గారి వద్ద నుండి ప్రేరణల ను పొందాయి. ప్రపంచ యుద్ధాలు రెంటి లో ఎంతో మంది భారతీయ సైనికులు వారి ప్రాణాల ను కోల్పోయారు. ఆయా యుద్ధాల లో భారతదేశాని కి ఎటువంటి పాత్ర లేకపోయినా వారు ధైర్యం గా పోరాడారు. మనం ఏ ఒక్కరి భూమి ని గాని లేదా వనరుల ను గాని ఎన్నడూ ఆశించ లేదు. కానీ, మన జవానులు శాంతి కోసం సమరం సలిపారు. దశాబ్దుల పాటు భారతదేశం ప్రపంచం లో ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాల లో అతి పెద్ద భాగస్వామి గా కొనసాగుతూ వస్తోంది. తరచు అదే పని గా ఘర్షణల తో సతమతమయ్యేటటువంటి కొన్ని మండలాలు శాంతి పవనాల ను శ్వాసించ గలుగుతున్నాయి అంటే అందులో మన సైనికుల కు పోషించడానికంటూ ఒక పాత్ర ఉన్నది. మతి లేని ద్వేషాని కి, హింస కు, ఘర్షణ కు, ఇంకా ఉగ్రవాదాని కి తావు లేనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించడం లో భారతదేశం యొక్క జీవన విధానం ఆశాకిరణం గా నిలుస్తోంది. భారతదేశం అనుసరించేటటువంటి ఘర్షణ నివారక పద్ధతి మందబలం కాక సంభాషణ యొక్క శక్తి గా నిలుస్తున్నది.
మిత్రులారా,
శాంతి పట్ల మరియు సామరస్యం పట్ల భారతదేశం నమ్మకాన్ని కలిగి ఉంది అని నేను అంటున్నానంటే అందులో ప్రకృతి మాత తోను,న పర్యావరణం తోను సామరస్యం అనేది జతపడివుంది అని చెప్తున్నానన్న మాట. వేదాలు అంటున్నాయి: यां रक्षन्त्यस्वप्ना विश्वदानीं देवा भूमिं पृथिवीमप्रमादम् అని.
ధరణి మాత, ఎక్కడయితే సాధువుల ధ్యానం చేస్తారో,
దాని ని సర్వ ప్రదాత గా వ్యవహరించడం జరుగుతుందో, దేని మీదయితే అన్ని రకాల జీవం ఆధారపడి ఉన్నదో అది అని ఈ మాటల కు భావం.
మన సంప్రదాయం పృథ్వి ని మన తల్లి గా పరిగణిస్తుంది. భారతదేశం లో దివ్యత్వం అనేది అనేక పశువుల తో ముడిపడి ఉంది. కౌటిల్యుడు మొక్క ల జాతుల ను మరియు పువ్వు ల జాతుల ను పరిరక్షించుకోవటాన్ని గురించి ఎంతో విస్తృతం గా వివరించారు. ఈ రోజు న చేపట్టే అనేక ప్రయత్నాల లో ఈ స్ఫూర్తి తాలూకు ఛాయల ను మనము చూస్తున్నాము. భారతదేశం అంతర్జాతీయ సౌర కూటమి ని ఏర్పాటు చేయడం లో నాయకత్వాన్ని వహించింది. పరిశుభ్రమైన రేపటి కోసం సౌర శక్తి ని వినియోగించుకోవాలి అనేదే దీని ధ్యేయం. అక్షయ శక్తి ని వినియోగించుకోవడాన్ని పెంచే దిశ గా మనం ప్రయత్నాలు చేస్తూ సాగిపోతున్నాము. ఎల్ఇడి బల్బుల దిశ గా భారతదేశం పెద్ద ఎత్తు న ముందంజ వేయడం వల్ల శక్తి ని చెప్పుకోదగిన స్థాయి లో ఆదా చేయడం సాధ్యపడింది. 36 కోట్ల ఎల్ఇడి బల్బుల ను పంచిపెట్టడం జరిగింది. ఒక కోటి ఎల్ఇడి వీధి దీపాల ను అమర్చడమైంది. ఇది 25 వేల కోట్ల రూపాయల మేరకు ఖర్చు ను తగ్గించేందుకు దారి తీసింది. నాలుగు కోట్ల టన్నుల కు పైగా బొగ్గు పులుసు వాయువు ఉద్గారాలు తగ్గిపోయాయి. శక్తి ఆదా సైతం భారీ స్థాయి లో ఉంది.
విశిష్ఠ అతిథులారా,
భారతదేశం లో పులుల సంఖ్య 2006వ సంవత్సరం నుండి రెట్టింపు అయింది. ప్రస్తుతం, భారతదేశం దాదాపు గా 2970 పులుల కు ఆవాసం గా ఉంది. ప్రపంచం లోని మూడు వంతుల వ్యాఘ్ర సంతతి భారతదేశం లో మనుగడ సాగిస్తున్నది. మన దేశం అత్యంత భద్రమైన వ్యాఘ్ర ఆవాసాల లో ఒక దేశం గా కొనసాగుతున్నది. 2022వ సంవత్సరం కల్లా పులుల సంఖ్య ను రెండింతలు చేయడానికి ప్రపంచం 2010వ సంవత్సరం లో అంగీకరించింది. మనం దీని ని ముందుగానే సాధించాము!
ఇదే మాదిరి గా, భారతదేశం లో సింహాల సంఖ్య 2010వ సంవత్సరం నుండి 2015వ సంవత్సరం మధ్య కాలం లో సుమారు ముప్ఫై శాతం మేరకు ఎగసింది. 2010వ సంవత్సరం లో ఈ సంఖ్య నాలుగు వందల పదకొండు గా ఉంది. ఇవాళ ఈ సంఖ్య ఆరు వందల కు పైబడిందని నా తో చెప్పారు.
మిత్రులారా,
భారతదేశం లో వన కవచం పెరుగుతున్నది. 2014వ సంవత్సరం లో రక్షిత ప్రాంతాల సంఖ్య 692 గా ఉంది. 2019వ సంవత్సరం లో ఇది 860 కి మించిపోయింది. 2014వ సంవత్సరం లో కమ్యూనిటీ రిజర్వులు 43 గా ఉండేవి. ప్రస్తుతం ఇవి 100 కు మించాయి. ఈ వాస్తవాలు ఎంతో మంది పర్యావరణ ప్రేమికుల ను, వన్యప్రాణి ప్రేమికుల ను భారతదేశం వైపునకు ఆకర్షిస్తున్నాయి. మీరు ‘మేన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమాన్ని చూసే ఉంటారు. ఆ కార్యక్రమం భారతదేశం పట్ల గొప్ప ఆసక్తి రేకెత్తేందుకు దోహదించింది.
మిత్రులారా,
ఇవాళ, మైండ్ ఫుల్ లివింగ్ , స్వస్థత తాలూకు స్పృహ ను కలిగి వుంటూ ఆహారాన్ని స్వీకరించటం, వేరు వేరు రకాలైన శరీర పాటవ దినచర్య లు ఎంతో ప్రజాదరణ పాత్రం అవుతున్నాయి. ఈ ఆరోగ్య వర్ధక అభ్యాసాల లో అనేకం ప్రపంచ వ్యాప్తం గా లోకప్రియమైనప్పటి కి వాటి యొక్క మూలాల ను భారతదేశం లో చూడవచ్చు అనే సంగతి మీకు తెలుసా? శతాబ్దాల కిందట భారతదేశ రుషులు యోగా ను అభ్యసించారు. మరి వారు ప్రపంచాని కి ఆయుర్వేదాన్ని అందించారు. యోగా అనేది కొన్ని అభ్యాసాల కూడిక మాత్రమే కాదు, అది దీని కి మించినటువంటిది. యోగా శరీర దృఢత్వం తో పాటు స్వస్థత కు ఒక సాధనం గా ఉంది. అది ఒక సౌష్టవ దేహాని కి, అలాగే ఆరోగ్యకరం అయినటువంటి మస్తిష్కాని కి పూచీ పడుతుంది. ఐఐఎమ్ లో చదువుకొనే వారు అత్యంత ప్రకాశవంతమైన సముదాయం లో ఒకరు గా ఉన్నారు. కానీ, అత్యంత తీరిక లేనటువంటి సమూహాల లోనూ వారు ఒకరు గా ఉన్నారు. ఉత్కృష్టమైన శ్రమ తాలూకు అవకాశాలు వాటితో పాటు ఒత్తిడి తో కూడినటువంటి నియమిత చర్యల ను కూడా వెంటబెట్టుకొని వస్తాయి. యోగా కోసం కాలాన్ని అట్టే పెట్టుకోవలసింది గా వారందరి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది అందించేటటువంటి సకారాత్మకమైన వ్యత్యాసాన్ని మీరు గమనించగలుగుతారు.
మిత్రులారా,
ఈ గడ్డ మీద అత్యంత అసాధారణమైనటువంటి అంశాల లో ఒకటి మహిళల కు ఇచ్చేటటువంటి గౌరవం, ప్రాముఖ్యత మరియు హోదా. नारी तू नारायणी. మహిళ లు దివ్యత్వాన్ని చాటి చెబుతారు. మహిళ ల సాధికారిత కల్పన కోసం మొట్టమొదటగా ఎలుగెత్తిన సందర్భం భారతీయ నాయకులదే. వారు ప్రతి శతాబ్దం లో ఈ మాట ను చెప్తూ వచ్చారు. భారతదేశం లో భక్తి ఉద్యమ సంతుల ను ఎవరు మాత్రం విస్మరించగలరు? రాజా రాం మోహన్ రాయ్, ఇంకా ఈశ్వర్ చంద్ర విద్యా సాగర్ ల వంటి మహనీయులు పోషించినటువంటి భూమిక ను ఎవరు మాత్రం మరువగలరు? మహాత్మ ఫులే మరియు సావిత్రీ భాయి ఫులే ల కృషి ని ఎవరు మరచిపోతారు?
పశ్చిమ దేశాల లో అనేక దేశాలు మహిళల కు వోటింగు హక్కుల ను ఇవ్వడం కోసం దశాబ్దాల వ్యవధి ని తీసుకొంటే మన రాజ్యాంగ శిల్పులు మొట్టమొదటి రోజు నుండే మహిళల కు వోటింగు హక్కు ను ప్రాప్తించేటట్లు జాగ్రత్త వహించారు!
ప్రస్తుతం ముద్ర రుణ స్వీకర్తల లో 70 శాతాని కి పైగా మహిళలే ఉన్నారు. మహిళ లు మన సాయుధ దళాల కు క్రియాశీలమైన తోడ్పాటు ను అందిస్తున్నారు. నౌకాదళాని కి చెందిన మహిళా అధికారుల బృందమొకటి సముద్ర మార్గం లో యావత్తు ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. అదొక చరిత్రాత్మక ఘట్టం.
ప్రస్తుతం భారతదేశం లో మహిళా ఎంపీ ల సంఖ్య అత్యధికం. 2019వ సంవత్సరం లో జరిగిన లోక్ సభ ఎన్నికల లో వోటు వేయడం కోసం వచ్చిన మహిళ ల సంఖ్య అత్యధికం గా ఉంది.
మిత్రులారా,
భారతదేశం దాపరికం లేనితనం అనే అంశం లో పండుగ చేసుకొంటోంది.
మహాత్మ గాంధీ ఈ క్రింది మాటల ను భలే గా చెప్పివున్నారు:
ఆయన అన్నారు కదా: ‘‘నేను నా ఇంటి కి అన్నివైపు ల గోడలు ఉండాలని, మరి నా ఇంటి యొక్క కిటికీ లు మూసివేసి ఉండాలని కోరుకోను. నేను అన్ని ప్రాంతాల యొక్క సంస్కృతి పవనాలు సాధ్యమైనంత వరకు నా ఇంటి లోపలకు వీచాలి అని భావిస్తాను. అయితే, నేను వాటిలో ఏ ఒక్క దాని మాయ లో పడాలని తలపోయను.’’
గాంధీ గారు మన సొంత సంస్కృతి ని చూసుకొని గర్వించడం కుదిరే పనే అని, అదే కాలం లో ఇతర సంస్కృతుల ను అక్కున చేర్చుకొని వాటి తో సద్భావన ను కలిగివుండాలని, ఈ రెండూ సాధ్యమేనని నిరూపించారు.
గురుదేవులు టాగూర్ తన భారత్ తీర్థ అనే తన పద్యం లో భారతదేశాన్ని గురించి ఈ క్రింది విధం గా వ్రాశారు:
‘‘ఈ భారత్ యొక్క అనంత మానవీయ సాగర తీరం లో నుండి
అందరూ ఇచ్చి పుచ్చుకోవాలి
కలసిపోయి మరియు ఇమిడిపోవాలి,
ఏ ఒక్కరూ కూడా విరక్తి తో నిష్క్రమించకూడదు.’’
మిత్రులారా,
ఎక్కడయితే దాపరికం లేనితనం అనేది ఉంటుందో, భిన్నాభిప్రాయాల కు గౌరవం ఉంటుందో, అక్కడ నూతన ఆవిష్కరణ అనేది స్వాభావికం. భారతీయుల లోని నూతన ఆవిష్కరణ ల సంబంధిత ఉత్సాహం ప్రపంచాన్ని భారతదేశం వైపునకు లాక్కుని వస్తున్నది. సున్నా తాలూకు ఆలోచన మన భూమి లోనే జనించింది. ఇది బహుశా అత్యంత సార్వత్రికమైన మరియు విప్లవాత్మకమైనటువంటి ఆలోచన కావచ్చు. ఇది గణిత శాస్త్ర అధ్యయనం తీరుతెన్నులనే మార్చివేసింది. మనం ఒక హుషారైన యువ జన సంఖ్య తో కూడినటువంటి దేశం గా ఉన్నాము. వయోవర్గం పరం గా మనకు ఉన్నటువంటి ఈ ప్రత్యేకత మన దేశాన్ని పెట్టుబడుల ను ఆకర్షించేటటువంటి ఒక అయస్కాంతం గా మార్చివేస్తున్నది. ఈ రోజు న ప్రతి ఒక్కరూ భారతదేశం లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. రెండు దశాబ్దాల క్రిందటి మన సాఫ్ట్ వేర్ పరిశ్రమ మరి ప్రస్తుతం మన స్టార్ట్-అప్ వ్యవస్థ భారతదేశం యువత యొక్క శక్తి ని చాటుతున్నాయి.
మిత్రులారా,
మనం ఎప్పుడయితే ప్రపంచీకరణ ను గురించి మరియు భారతీయ భావ స్రవంతి ని గురించి మాట్లాడుకుంటున్నామో, అదే కాలం లో దాని యొక్క వినియోగాన్ని గురించి కూడా చర్చించడం ముఖ్యమైపోతుంది. భారతీయ విలువల లోను, భారతీయ సంప్రదాయాల లోను వేళ్ళూనుకొని ఉండటం అనే కారణం గా ప్రతి ఒక్కరూ గర్వించటట్టు చేయగలదు. భారతదేశం అభివృద్ధి మార్గం లో మున్ముందుకు సాగిపోతున్నది. భారతదేశం అసాధారణమైనటువంటి ఫైనాన్శియల్ ఇన్‌క్లూజన్ ను సాధించిన క్రమం లో దీని ని మీరు గమనించగలుగుతారు. లేదంటే మనం ప్రపంచం లో కల్లా అతి పెద్దదైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని మనం ఏ విధం గా ప్రవేశపెట్టామో అనేది చూడండి. లేదంటే, భారతదేశం కోట్లాది పొగ లేని వంట గదుల ను లక్షల మంది కి ఏ విధం గా అందించిందో చూడండి. నిరుపేద ప్రజానీకం కోసం మిలియన్ ల కొద్దీ ఇళ్ళ ను నిర్మించడం జరిగింది.
మన ఎన్నికల ప్రక్రియ ను గమనించండి. మిలియన్ ల కొద్దీ వోటర్లు ప్రశాంతం గా వోట్లు వేస్తున్నారు. సుదూర ప్రాంతాల లో కనీసం ఒక్క వోటరు ఉన్నా కూడా, పోలింగు కేంద్రాల ను ఆ ప్రాంతం లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ వ్యవస్థ లో భారతదేశ స్థానం ఎగబాకుతూ ఉండటం లో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
మిత్రులారా,
భారతీయ ఆలోచన ప్రపంచాని కి ఎంతో అందించింది. మరెంతో అందించేటటువంటి సామర్ధ్యం కూడా దీనికి ఉంది. దీనికి మన భూగ్రహం ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధానమైన సవాళ్ళ లో కొన్ని సవాళ్ళ ను పరిష్కరించే సత్తా ఉన్నది.
బాల్యం లోనే మనకు నేర్పారు:
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् ।
ప్రతి ఒక్కరు సంతోషం గా ఉందురు గాక, ప్రతి ఒక్కరూ అస్వస్థత బారి న పడకుండా ఉందురు గాక. ప్రతి ఒక్కరూ మంచితనాన్ని అలవరచుకొందురు గాక. ఎటువంటి అసంతోషాని కి తావు లేకపోవును గాక అని ఈ మాటల కు అర్థం.
ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటే అది కేవలం భారతదేశాని కి మరియు భారతీయుల కు సంబంధించింది కాదు; అది ప్రపంచాన్ని సూచించేది.
భారతదేశం పురోగమిస్తూ ఉంటే, ప్రపంచం ముందుకు సాగుతుంది అని భారతదేశం నమ్ముతుంది. మరి ప్రపంచం సమృద్ధం అయినప్పుడు, దాని ద్వారా భారతదేశం లాభపడుతుంది. ఇటువంటి చర్చాసభలు భారతీయ ఆలోచన ల తాలూకు మరిన్ని కోణాల కు ప్రజల లో ఆదరణ ను విస్తృతం చేస్తాయని నేను ఆశిస్తున్నాను.
ఈ మాటల తో నేను నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ, ఐఐఎమ్ కోషిక్కోడ్ కు నా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.
మీకు ధన్యవాదాలు.
మీకు అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
**
It is no coincidence that we are talking about globalising Indian thought at a time when a life-sized statue of Swami Vivekananda finds a special place on this campus.
— PMO India (@PMOIndia) January 16, 2020
Who can forget the contribution of Swami Vivekananda in globalising Indian thought: PM @narendramodi
Indian thought is vibrant and diverse. It is constant and evolving: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 16, 2020
Broadly, there are certain ideals that have remained central to Indian values.
— PMO India (@PMOIndia) January 16, 2020
They are- compassion, harmony, justice, service and openness: PM @narendramodi
For centuries we have welcomed the world to our land.
— PMO India (@PMOIndia) January 16, 2020
Our civilisation has prospered when many could not.
Why? Because one finds peace and harmony here: PM @narendramodi
In the 20th century, Mahatma Gandhi championed these ideals and this contributed to India’s freedom.
— PMO India (@PMOIndia) January 16, 2020
At the same time, they gave strength to millions outside: PM @narendramodi
In a world seeking to break free from mindless hate, violence, conflict and terrorism, the Indian way of life offers rays of hope.
— PMO India (@PMOIndia) January 16, 2020
The Indian way of conflict avoidance is not by brute force but the power of dialogue: PM @narendramodi
The IIM community is one of the brightest but one of the most busy group of people.
— PMO India (@PMOIndia) January 16, 2020
The excellent work prospects also bring with it stressful routines. I would urge them all to devote time to Yoga.
You will see the positive difference it brings: PM @narendramodi
Even while most western countries took decades to give voting rights to women, the makers of our Constitution ensured women had voting rights from the very first day: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 16, 2020
Where there is openness, respect for different opinions, innovation is natural.
— PMO India (@PMOIndia) January 16, 2020
The innovative zeal of Indians is drawing the world to India: PM @narendramodi
Indian thought has given a lot to the world and has the potential to contribute even more. It has the potential to solve some of the most leading challenges our planet faces: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 16, 2020