Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైట్ లేబుల్ ఎటిఎంల‌లో ఆటోమేటిక్ రూట్‌లో నూరు శాతం ఎఫ్‌డిఐ – విధానం స‌మీక్ష


ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలో స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండ‌లి వైట్ లేబుల్ ఎటిఎంల విభాగంలో (డ‌బ్ల్యుఎల్ఏ) కార్య‌క‌లాపాల‌కు ఆటోమేటిక్ రూట్ లో నూరు శాతం ఎఫ్‌డిఐని అనున‌మ‌తించేందుకు ఆమోద‌ముద్ర వేసింది. అందుకు సంబంధించిన ష‌ర‌తులు ఇలా ఉన్నాయి…

i. డ‌బ్ల్యు.ఎల్.ఏ. ఏర్పాటు చేయాల‌న్న ఆకాంక్ష గ‌ల ప్ర‌తీ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థకు తాజాగా ఆడిట్ చేసిన బాలెన్స్ షీట్ కింద‌ క‌నీసం 100 కోట్ల రూపాయ‌ల నిక‌ర విలువ గ‌లిగి ఉండాలి. ఈ నిక‌ర విలువ త‌దుప‌రి కాలంలో స్థిరంగా ఉండాలి.

ii. సంబంధిత సంస్థ దేశంలోని ఇత‌ర 18 ఎన్.బి.ఎఫ్‌.సి.లు చేప‌డుతున్న కార్య‌క‌లాపాల్లో ఏదైనా చేప‌డుతూ ఉన్న‌ట్ట‌యితే 2015 క‌న్సాలిడేటెడ్ ఎఫ్‌డిఐ పాల‌సీ స‌ర్కుల‌ర్ 6.2.18.8.2 పేరాలోని నిబంధ‌న‌ల కింద క‌నీస మూలధ‌న నిబంధ‌న‌ల‌కు కూడా లోబ‌డి ఉండాలి.

iii. డ‌బ్ల్యు.ఎల్.ఏ.ఒ.లో ఎఫ్‌డిఐలు ఆర్.బి.ఐ. స‌ర్కుల‌ర్ నంబ‌ర్ డిపిఎస్ఎస్‌.సిఒ.పిడి.నం.2298/02.10.002/2011-2012కు అనుగుణంగాను, కాలానుగుణంగా జ‌రిగే స‌వ‌ర‌ణ‌ల‌కు లోబ‌డి ఉంటాయి. ఈ నిర్ణ‌యం దేశంలో విదేశీ పెట్టుబ‌డుల‌కు సంబంధించిన నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో పాటు పెట్టుబ‌డుల రాక‌లో వేగాన్ని పెంచుతుంది. ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న కింద ఆర్థిక కార్య‌క‌లాపాలు అంద‌రికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు కొత్త ఉత్తేజం ఏర్ప‌డుతుంది. భార‌త్‌లో పెట్టుబ‌డి నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో డ‌బ్ల్యు.ఎల్.ఏ.
కార్య‌క‌లాపాల్లో త‌గిన‌న్ని పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నారు. సెమీ అర్బ‌న్‌, గ్రామీణ ప్రాంతాల్లో కూడా (మూడ‌వ‌, నాల్గ‌వ శ్రేణి ప్ర‌దేశాలు) ఎటిఎం నెట్‌వ‌ర్క్ ను విస్త‌రించే ల‌క్ష్యానికి కొత్త ఉత్తేజం ఏర్ప‌డుతుంది.

ఈ విభాగంలో విదేశీ ఇన్వెస్ట‌ర్ల భాగ‌స్వామ్యం వ‌ల్ల ఫైనాన్సియ‌ల్ ఇంక్లూజ‌న్ కార్య‌క‌లాపాలు మ‌రింత‌గా విస్త‌రిస్తాయి.

నేప‌థ్యం

దేశంలో అన్ని వ‌ర్గాల వారికి ఆర్థిక కార్య‌క‌లాపాలు అందుబాటులోకి తేవాల‌ని, అంద‌రినీ ఆర్థిక కార్య‌క‌లాపాల్లో భాగ‌స్వాముల‌ను చేయాల‌న్న‌ది ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ కింద ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ఖాతాల వివ‌రాలు తెలుసుకోవ‌డం, న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌, బ్యాంకుకు పోవ‌ల‌సిన ప‌ని లేకుండానే ఆర్థిక‌, ఆర్థికేత‌ర కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు ఎటిఎం వ్య‌వ‌స్థ‌ను ఒక మాధ్య‌మంగా చేయ‌డం ద్వారా ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్‌ను విస్త‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఎటిఎంల ఏర్పాటులో ప్ర‌తీ ఏడాది వృద్ధి న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ అవి ప్ర‌థ‌మ‌, ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కే ప‌రిమితం అవుతున్నాయి. మూడు, నాల్గ‌వ శ్రేణి ప్ర‌దేశాల‌కు కూడా వాటిని విస్త‌రించ‌డం కోసం ఎటిఎంల ఏర్పాటును అనుమ‌తించ‌డ‌మే వైట్ లేబుల్

ఎటిఎంలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వైట్ లేబుల్ ఎటిఎం కార్య‌క‌లాపాల్లో ఎఫ్‌.డి.ఐ. ప్ర‌భుత్వ అనుమ‌తికి లోబ‌డే ఉండేది. దీని వ‌ల్ల ద‌ర‌ఖాస్తుల‌ ప్రాసెసింగ్ లోనే కాలం గ‌డిచిపోవ‌డం, దాని ప్ర‌భావం వ‌ల్ల ప్రాజెక్టుల్లో జాప్యం చోటు చేసుకుంటున్నాయి. ఇన్వెస్ట‌ర్లు అత్యంత ప్ర‌ధాన‌మైన ఈ విభాగంలో పెట్టుబ‌డుల ప‌ట్ల విముఖత ప్ర‌ద‌ర్శిస్తున్నారు.