Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యవసాయ రంగంలో సహకారానికిగాను భారతదేశం, పాలస్తీనా ల మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


వ్యవసాయ రంగంలో సహకారానికిగాను భారతదేశ వ్యవసాయ మరియు వ్యవసాయదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు, స్టేట్ ఆఫ్ పాలస్తీన్ లోని వ్యవసాయ మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ఒయు పై 2017 మే నెలలో పాలస్తీనా మంత్రి భారతదేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో సంతకాలయ్యాయి.

వ్యవసాయ పరిశోధన, పాలస్తీనా లో పశువైద్య సేవలు మరియు పశు సంవర్ధకం యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం, సేద్యపు నీటి పారుదల, శీతోష్ణ స్థితిలో మార్పు వంటి రంగాలలో సహకారానికి బాట వేస్తుంది. మొక్కలు మరియు భూసారం, శానిటరీ, ఫైటోశానిటరీ లెజిస్లేషన్, సస్య రక్షణ, పశు సంవర్ధకం, ఆధునిక సాగునీటి పరిజ్ఞానం రంగాలలో అనుభవాలను ఇచ్చి పుచ్చుకోవడం, శిక్షణ, కెపాసిటీ బిల్డింగ్ వగైరాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి.

ఈ ఎమ్ఒయు లో భాగంగా, ఎమ్ఒయు లో పొందుపరచిన లక్ష్యాల సాధనకుగాను పథకాలను మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి గాను ఒక వ్యవసాయ సారథ్య సంఘాన్ని నియమిస్తారు. ఇది సహకారానికి ఒక కార్యక్రమ పట్టికను కూడా నిర్దేశిస్తుంది.

***