ధన్తేరస్ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్రావ్ జాదవ్ రాసిన ఒక వ్యాసాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆ దిశగా ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆయుర్వేదం స్పష్టంగా బోధిస్తున్నదని ఆ వ్యాసంలో వివరించారు. మనం ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని, ఏమి తింటున్నామన్నది జాగ్రత్తగా గమనించి మరీ భుజించాలని, క్రమం తప్పక యోగాభ్యాసం చేస్తుండాలని, మానవశరీరానికి తగినంత నిద్ర కూడా అవసరమేనని, నిర్దిష్ట గడువుల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆ వ్యాసం సూచిస్తోంది.
అంతేకాకుండా ఆప్తుల ఆరోగ్య పరిరక్షణ ప్రాధాన్యాన్ని తెలుసుకొని డబ్బును పెట్టుబడి పెట్టాలని, కుటుంబ సభ్యులకు స్వస్థ భవిష్యత్తును అందించాలని కూడా ఆ వ్యాసం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘ఈ ధన్తేరస్ నాడు, ఆరోగ్య సంరక్షణ దిశగా చొరవ తీసుకోండి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ వ్యాధుల బారిన పడకుండా జీవించడం ఎందుకు అవసరం అనే విషయాలకు ఆయుర్వేదంలో ప్రాధాన్యాన్నిచ్చారని కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్రావ్ చెబుతున్నారు. మనం తినే పదార్థాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలు.. క్రమం తప్పక యోగా చేయడం, తగినంత నిద్రపోయే అలవాటును చేసుకోవడం, నిర్దిష్ట గడువుల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వరకు.. ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించవలసిందిగా మంత్రి మనకు సూచనలు చేశారు.
మన ప్రియతముల ఆరోగ్యం, మన కుటుంబ సభ్యులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించడం అత్యంత ప్రాధాన్యం గల అంశాలు. దీనిని దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా అవసరమైన చొరవను మనమందరం ఇప్పుడే తీసుకుందాం రండి.’’
***
This Dhanteras, make a commitment to better health! Union MoS Shri @mpprataprao highlights how Ayurveda emphasises the preservation of health and why preventive healthcare matters. He encourages families to adopt healthier habits, from mindful eating and regular Yoga to adequate sleep and timely health screenings. Let us invest in what matters most - the health of our loved ones and a healthier future for our families.
— PMO India (@PMOIndia) November 6, 2026