పిఎంఇండియా
శనివారం ( సెప్టెంబర్ 26 ) న భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూయార్క్ సిటీలో జరగనున్నజీ-4 కీలక సదస్సులో పాల్గొంటారు. భారత్ తో పాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలు జీ-4 సమూహంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సంస్కరణలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. అనంతరం భారత ప్రధాని శాన్జోస్ కు వెళ్లనున్నారు. అక్కడ టెస్లా మోటార్స్‌ను సందర్శించడంతో పాటు ఐటి కంపెనీల ఉన్నతాధికారులతో శ్రీ నరేంద్ర మోదీ సమావేశమవుతారు. టిమ్ కుక్ ( యాపిల్ ), సత్యా నాదెండ్ల ( మైక్రోసాఫ్ట్ ), సుందర్ పిచాయ్ ( గూగుల్), శంతను నారాయణ్ ( అడోబ్) లను ప్రధాని కలుసుకుంటారు. అనంతరం డిజిటల్ ఇండియా పై ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. డిజిటల్ ఇండియా డిన్నర్‌లో పాల్గొంటారు.