Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ‌శైలం లో జ‌రిగిన‌ రాష్ట్రీయ జ‌న‌ జాగృతి ధ‌ర్మ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి

శ్రీ‌శైలం లో జ‌రిగిన‌ రాష్ట్రీయ జ‌న‌ జాగృతి ధ‌ర్మ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి


శ్రీ‌శైలం లో ఈ రోజు జ‌రిగిన‌ రాష్ట్రీయ జ‌న‌ జాగృతి ధ‌ర్మ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.

ఉగాది సందర్భంగా ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లను తెలుపుతూ, ఉగాది నవీన ఆరంభాలు మ‌రియు నూతన ఆశ‌ల‌ పండుగ అని గుర్తు చేశారు.

ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను మ‌రియు కాలావధుల‌ను పెట్టుకొని వివిధ ప‌థ‌కాల‌ ద్వారా కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఈ సంద‌ర్భంలో, జ‌న్ ధ‌న్ ఖాతాలు, పేద‌ల‌కు బీమా సౌక‌ర్యం, ఉజ్జ్వ‌ల వంట గ్యాస్ క‌నెక్ష‌న్ లు, ముద్ర యోజ‌న, ఇంకా ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ల‌లో చోటు చేసుకొన్న పురోగ‌తిని గురించి ఆయన ప్ర‌స్తావించారు.

అవ‌స్థాప‌న అభివృద్ధి యొక్క వేగం గణనీయంగా వేగాన్ని పుంజుకొందని ఆయ‌న పేర్కొన్నారు. ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం తో పాటు జాతీయ పోష‌ణ్ అభియాన్ ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ దేశంలో ప‌రిశుభ్ర‌త ప‌రిధి గ‌ణ‌నీయంగా పెరిగేందుకు బాట వేసింద‌ని ఆయ‌న చెప్పారు.

దేశాన్ని ఆవ‌రించివున్న బ‌ల‌హీనతల నుండి దేశం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బయటపడాల‌ని ప్రజలు ప్రస్తుతం కోరుకుంటున్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. జాతి నిర్మాణం ల‌క్ష్య సాధ‌న‌కై ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిశ్ర‌మిస్తోంద‌ని, ఈ ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌తి ఒక్క‌రి మ‌ద్ద‌తు వేగగతిని అందించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న తెలిపారు.

***