Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సజ్జన సాంగత్యం, వివేకంగల సలహాలు ప్రధానమని చెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


సజ్జన సావాసంవివేకం గల సలహాలూ విలువైనవని బోధిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారువివేకవంతుల సాంగత్యంపవిత్ర ఆలోచనలుస్వార్థానికి చోటీయని స్నేహం.. ఇవి పరిపూర్ణశాంతియుత జీవితానికి ఎంతయినా అవసరమని ఎప్పటికీ గుర్తు చేసే సందేశాన్ని ఈ సుభాషితం మనకు అందిస్తోంది:
‘‘
ఉత్తమైః సహ సాంగత్యం పండితైః సహ సత్కథామ్అలుబ్ధైః సహ మిత్రత్వం కుర్వాణో నావసీదతి’’.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ‘‘ఉత్తమైః సహ సాంగత్యం పండితైః సహ సత్కథామ్అలుబ్ధైః సహ మిత్రత్వం కుర్వాణో నావసీదతి’’ అని పేర్కొన్నారు.

 

***