Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సమాజంలో బలహీన వర్గాలకు అందిస్తున్న సాంఘిక సంక్షేమ పథకాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ


పాత్రికేయుడు, రచయిత శ్రీ అజయ్ సింగ్ రాసిన వ్యాసాన్ని ప్రజలతో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకున్నారు.
వరుస పదవీకాలాల్లో ప్రజలు ఎన్నుకొన్న ప్రధానమంత్రిగా భారత్‌కు సుదీర్ఘకాలం సేవలను అందించిన ఖ్యాతిని శ్రీ నరేంద్ర మోదీ పొందారని ఈ వ్యాసంలో శ్రీ సింగ్ ప్రశంసించారు. ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అందిస్తున్న సాంఘిక సంక్షేమ పథకాలు సమాజంలో బలహీన వర్గాల చెంతకు చేరుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్య ఆందోళనలను దూరం చేస్తున్నాయని కూడా ఈ వ్యాస రచయిత కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘వరుస పదవీకాలాల్లో ప్రజలు ఎన్నుకొన్న ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ నిలిచి, భారత్‌కు సుదీర్ఘకాలం సేవలను అందించారంటూ శ్రీ అజయ్ సింగ్ తన వ్యాసంలో ప్రశంసించారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ  భారత్ ప్రతిభకు ప్రతీకగా ఉంటూ దేశ రాజకీయ ఆలోచనలలో మార్పును తీసుకువచ్చారని, సమాజంలో బలహీన వర్గాలను కలుపుకొని ముందుకు పోవడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్య ఆందోళనలను దూరం చేయడానికి సామాజిక సంక్షేమ పథకాలను ప్రధాని శ్రీ మోదీ అమలు చేస్తున్నారని కూడా శ్రీ సింగ్ కొనియాడారు’’ అని పేర్కొన్నారు.

***