Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సమ్మిళిత పాలన, సమర్థవంతమైన అమలును స్పష్టం చేసే వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


మాజీ ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శి శ్రీ హస్ముఖ్ అధియా రాసిన వ్యాసాన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. దూరదృష్టి, సరైన లక్ష్యం, మంచి పాలన భారతదేశాన్ని ప్రగతి బాటలో ఎలా నడిపిస్తాయో ఈ కథనం స్పష్టం చేస్తుంది. దేశాన్ని బలోపేతం చేయటంలో ప్రజా కేంద్రీకృత విధానాలు, సమర్థవంతమైన పాలనలో వచ్చిన మార్పులపై గొప్ప దృక్పథాన్ని ఈ కథనం అందిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పోస్టు చేశారు.

పేదలు, అణగారిన వర్గాలను కేంద్రంగా చేసుకుని విధానాలను రూపొందించి, నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడు సమాజం, దేశం రెండూ బలంగా తయారవుతాయి. దూరదృష్టితో కూడిన ఆలోచన, సరైన లక్ష్యం, సుపరిపాలన దేశ ప్రగతికి మార్గం సుగమం చేస్తాయని భారతదేశ మాజీ ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శి అధియా ఈ కథనంలో వివరించారు.

https://www.amarujala.com/india-news/why-narendra-modi-is-successful-management-human-spiritual-qualities-2026-09-18

 

***