Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా నదుల అనుసంధానం కోసం ప్రత్యేక సంఘాన్ని నియమించడం మరియు స్టేటస్- కమ్- ప్రోగ్రెస్ రిపోర్టు కు మంత్రివర్గం ఆమోదం


నెట్ వర్కింగ్ ఆఫ్ రివర్స్ పై దాఖలైన రిట్ పిటిషన్ (సివిల్) 512 ఆఫ్ 2002 తో పాటు, రిట్ పిటిషన్ నంబర్ 2002 ఆఫ్ 668 ల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం 27.2.2012 నాడు ఇచ్చిన తీర్పు నకు అనుగుణంగా నదుల అనుసంధానం కోసం ప్రత్యేక సంఘాన్ని నియమించడం మరియు స్టేటస్- కమ్ -ప్రోగ్రెస్ రిపోర్టు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

భారతదేశ ప్రభుత్వ నేషనల్ పర్ స్పెక్టివ్ ప్లాన్ 1980 లో భాగంగా నదుల అనుసంధానం ప్రాజెక్టులను పర్యవేక్షించడంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం సహాయపడనుంది. నదుల అనుసంధానం కోసం వేసిన ప్రత్యేక సంఘం యొక్క స్టేటస్ కమ్ ప్రోగ్రెస్ రిపోర్టు ను మంత్రివర్గ సమాచారం కోసం ద్వైవార్షిక పద్ధతిన దాఖలు చేస్తారు. ఇది దేశ హితం కోసం తగిన నిర్ణయాలను సాధ్యమైనంత శీఘ్రంగా తీసుకోవడంలో తోడ్పడుతుంది.