Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సివిల్ సర్వీసుల దినోత్సవం.. సివిల్ సర్వీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఈ రోజు సివిల్ సర్వీసుల దినోత్సవంఈ సందర్భంగా సివిల్ సర్వీసు అధికారులందరికీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారుఇది సుపరిపాలనదేశ నిర్మాణం దిశగా కృషిచేయాలనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన సందర్భమని శ్రీ మోదీ అన్నారు. ‘‘క్షేత్ర స్థాయి మొదలు విధాన రూపకల్పన స్థాయి వరకూ.. సివిల్ సర్వెంట్లు తమ కృషితో అసంఖ్యాక ప్రజలకు చేరువ అవుతూభారత ప్రగతికి తోడ్పాటును అందిస్తున్నారుమన సివిల్ సర్వీసు అధికారులు అంకితభావంతోనూసహానుభూతితోనూనవకల్పనతోనూ సేవలందించడాన్ని కొనసాగించాలనీవిధినిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘సివిల్ సర్వీసు అధికారులందరికీ సివిల్ సర్వీసెస్ డే శుభాకాంక్షలుసుపరిపాలనదేశ నిర్మాణం దిశగా పనిచేద్దామన్న సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకొనే సందర్భం ఇదిక్షేత్ర స్థాయి మొదలు విధాన రూపకల్పన స్థాయి వరకూ.. అధికారులు తమ కృషితో అసంఖ్యాక ప్రజలకు చేరువ అవుతూభారత ప్రగతికి తోడ్పాటును అందిస్తున్నారుఅంకితభావంతోసహానుభూతితోనవకల్పనతో సేవలందించడాన్ని వారు కొనసాగించాలనీవిధినిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలనీ కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***