Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుక్మా లో సిఆర్ పిఎఫ్ సిబ్బంది పై జరిగిన మారణకాండ పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ఛత్తీస్ గఢ్ లోని సుక్మా లో సిఆర్ పిఎఫ్ సిబ్బందిపైన జరిగిన మారణకాండ పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర విచారం వ్యక్తం చేశారు.

“సుక్మా లో సిఆర్ పిఎఫ్ సిబ్బంది పైన జరిగిన మారణకాండ విచారకరం. మృతవీరులకు ఇవే నా నివాళులు; వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

సుక్మా లోని పరిస్థితిని గురించి హోం మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడాను. ఆయన సుక్మా స్థితిని గురించి వాకబు చేయడం కోసం అక్కడికి వెళ్తున్నారు” అని ప్ర‌ధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.