పిఎంఇండియా
న్యూఢిల్లీలో ఈ రోజు సోమనాథ్ ట్రస్ట్ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ కేశూభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ ఎల్ .కె. అద్వానీ, శ్రీ హర్ష వర్ధన్ నియోతియా, ఇంకా పి.కె. లాహిరి లు ట్రస్టీ ల హోదాలో హాజరయ్యారు.
ట్రస్టు శ్రీ కేశూభాయ్ పటేల్ ను 2016 సంవత్సరానికి ట్రస్టు ఛైర్మన్ గా తిరిగి నియమించింది. శ్రీ అమిత్ షా ను దివంగత శ్రీ ప్రసన్నవదన్ మెహతా స్థానంలో ట్రస్టీగా నియమించింది. కాగా, శ్రీ రాజన్ కిలాచంద్ రాజీనామా చేశారు.
ప్రధాన మంత్రి సోమనాథ్ ఆలయాన్ని మత సంబంధమైన ముఖ్య పర్యటక స్థలంగా తీర్చి దిద్దవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అక్కడ ఒక సభాభవనాన్ని, అత్యాధునిక వర్చుయల్ మ్యూజియాన్ని నిర్మించాలని కూడా ఆయన సూచించారు. ఈ సందర్భంగా, సోమనాథ్, దియూ, గీర్ లయన్ సఫారీ లను కలుపుతూ వెళ్లే ఒక టూరిస్ట్ సర్క్యూట్ ను ఏర్పాటు చేయాలని కూడా ప్రధాని సలహా ఇచ్చారు. పర్యటకులను ఆకర్షించే మరిన్ని ప్రదేశాలను సైతం జత చేయాలని ట్రస్టు నిర్ణయించింది.