Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వచ్ఛ భారత్‌పై నీతి ఆ యోగ్‌ ముఖ్యమంత్రుల ఉపసంఘం నివేదికలోని ముఖ్యాంశాలు.

స్వచ్ఛ భారత్‌పై నీతి ఆ యోగ్‌ ముఖ్యమంత్రుల ఉపసంఘం నివేదికలోని ముఖ్యాంశాలు.

స్వచ్ఛ భారత్‌పై నీతి ఆ యోగ్‌ ముఖ్యమంత్రుల ఉపసంఘం నివేదికలోని ముఖ్యాంశాలు.

స్వచ్ఛ భారత్‌పై నీతి ఆ యోగ్‌ ముఖ్యమంత్రుల ఉపసంఘం నివేదికలోని ముఖ్యాంశాలు.

స్వచ్ఛ భారత్‌పై నీతి ఆ యోగ్‌ ముఖ్యమంత్రుల ఉపసంఘం నివేదికలోని ముఖ్యాంశాలు.


స్వచ్ఛభారత్‌పై ఏర్పాటు చేసిన నీతి ఆ యోగ్‌ ముఖ్యమంత్రుల ఉపసంఘం తన నివేదికను సమర్పించింది. ఉపసంఘం చైర్మన్‌గా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం అందజేశారు.
ఆ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ.

మరుగుదొడ్ల నిర్మాణానికి, ప్రవర్తనా పరివర్తన సందేశానికి (బీసీసీ) సమాన ప్రాధాన్యం ఇ వ్వాలి. ఎందుకంటే ఓడీఎఫ్‌ కార్యక్రమ సాఫల్యాన్ని ప్రధానంగా మరుగుదొడ్ల వినియోగం ఆధారంగా లెక్కించాల్సి ఉంటుంది.

ఇందుకు వ్యూహ రచన, అ మలు చేసే విధానం, పర్యవేక్షణ పద్ధతి, ప్రచారంలో ప్రగతిని గణించడం కోసం కేంద్ర రాష్ట్ర స్థాయుల్లో, వృత్తి నిపుణులతో కూడిన ఒ క సంస్థను ఏర్పాటు చేయడం అ వసరం.

మొత్తం నిధుల్లో బీసీసీకి వాటాను, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ కరీతిన 25 శాతానికి పెంచవచ్చు. ఈ నిధులన్నిటినీ కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.

పారిశుద్ధ్య‌ సందేశాన్ని పటిష్ఠంగా వ్యాప్తిచేసేందుకు రాజకీయ, సాంఘిక, సామాజిక నాయకులను, సెలబ్రిటీలను భాగస్వాములను చేయాలి.

పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలను ఒ కటవ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో చేర్చాలి. పారిశుద్ధ్యం‌, పరిశుభ్రతపై అ వగాహనను ప్రచారం చేసేందుకు ప్రతి బడి, కాలేజీలో స్వచ్ఛ సేనాని పేరుతో విద్యార్థి బృందాలను ఏర్పాటు చేయాలి.

ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, కాలేజీల్లో ఈ అంశానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి కోర్సులను, డిప్లమా కోర్సులను ప్రవేశపెట్టవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వీటితో జోడించవచ్చు.

పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి ప్రత్యేక రంగాల్లో పరిశోధనను ప్రోత్సహించడానికి ఉన్నత విద్యా సంస్థల్లో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఈ రంగాల్లో మంచి డాక్టోరల్‌, పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధకులను తయారు చేయవచ్చు.

ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీని 75:25 నిష్పత్తిలో చేయవచ్చు. పర్వత ప్రాంత రాష్ట్రాలకు దీన్ని 90 : 10గా ఉంచవచ్చు. దీనికి తోడు డీజిల్‌, పెట్రోలు, టెలికాం సేవలపై కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ సుంకాన్ని విధించాలి. బొ గ్గు, అల్యుమినియం, ముడి ఇనుము పరిశ్రమలు మిగిల్చే ఖనిజ వ్యర్థాలపై కూడా స్వచ్ఛ భారత్‌ సుంకాన్ని వేయవచ్చు. కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత నిధి తరహాలోనే రాష్ట్ర స్థాయుల్లో కూడా స్వచ్ఛ భారత నిధిని ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ రంగ సంస్థలు/ కంపెనీలు ఇచ్చే సీఎస్‌ఆర్‌ విరాళాల్లో కొంత భాగాన్ని ఆ యా కంపెనీలు కొలువై ఉన్న రాష్ట్రాల్లో ఖ ర్చు చేయాలి.

14వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ల వ్యయంపై మొదటి చార్జిని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద చేపట్టిన కార్యక్రమాలకు ఇ వ్వాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల పరిధిలోకి రాని ఈ శాన్య రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని గ్రామీణ ప్రాంతాల కోసం, ఆ యా రాష్ట్రాలకు గ్రాంట్లు విడుదల చేసే అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలించాలి.
స్వచ్ఛ భారత్‌ బాండ్ల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్లు విడుదల చేయాలి.

స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కార్యక్రమానికి మార్గ నిర్దేశం, సమన్వయం, మద్దతు సమీకరణ, పర్యవేక్షణ కోసం కేంద్ర రాష్ట్ర స్థాయుల్లో ఒ క ప్రత్యేక మిషన్‌ ఏర్పాటు చేయాలి.

పారిశుద్ధ్యానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించడం నుంచి సమీకరించే దాకా మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక పరిపాలనా సంస్థలకు సహకరించడం కోసం జాతీయ సాంకేతిక బో ర్డును ఏర్పాటు చేయాలి.

వ్యర్థాల నిర్వహణకు చౌకైన పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలను సాంకేతిక భాగస్వాములుగా చేయాలి.

వ్యర్థాల నుంచి కరెంటు ఉత్పత్తి చేసే విద్యుత్కేంద్రాలకు కరెంటుకు సంబంధించి టారిఫ్‌ విధానాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ రూపొందించాలి. ఇ లాంటి విద్యుదుత్పత్తి కేంద్రాలకు గిట్టుబాటు అ య్యే రీతిలో వాటి నుంచి ఉత్పత్తయ్యే కరెంటుకు విద్యుత్‌ నియంత్రణ సంస్థలు టారిఫ్‌ను ఖరారు చేయాలి. వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ల ద్వారా తయారయ్యే కరెంటును రాష్ట్రాల విదుత్తు బో ర్డులు, పంపిణీ సంస్థలు తప్పనిసరిగా కొనాల్సిందేనని నిర్దేశించాలి.
కంపోస్ట్‌ వంటి ఉత్పన్నాలను అ మ్మే ప్రైవేటు సంస్థలకు ఉత్పత్తి ఆధారిత రాయితీని అందజేయాలి. రసాయన ఎ రువులపై సబ్సిడీని తగ్గించాలి. అ లాగే కంపోస్టు వాడాన్ని ప్రోత్సహించేలా కంపోస్టు ఎ రువులకు రాయితీని పెంచాలి.

వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపులను ప్రకటించాలి. తద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యాపారాన్ని గిట్టుబాటు అ య్యేలా చూడాలి.

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటుకు అ వసరమయ్యే పరికరాలను సేకరించేందుకు అ య్యే ఖ ర్చు గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ మంత్రిత్వ శాఖలు అంచనాలు రూపొందించాలి. ఈ పరికరాల సేకరణకు సంబంధించి సమూనా విధానాన్ని తయారుచేయాలి.
ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ప్రభుత్వ- ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టవచ్చు. ఇ లా శుద్ధి పరిచిన నీటిని భారీ మొత్తాల్లో వాడుకునేలా పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.

వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లను కూడా పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయవచ్చు. అదే సమయంలో ఈ ప్లాంట్లకు సంబంధించి సానిక పరిపాలన సంస్థ, పీపీపీ భాగస్వామి బాధ్యతలను ప్రత్యేకంగా ముందే నిర్దేశించాలి.

మురుగు నీటి కాల్వల సౌకర్యం లేని మురికి వాడల్లో బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలి.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సార్వత్రిక, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణలో వేర్వేరు విధానాలు అ వలంబించాల్సిన అ వసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇ లాంటి వాటి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించాలి. పట్టణ ప్రాంతాల్లో వీటికి రుసుము ఆధారిత వాడకం విధానం మంచిది.
పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన నైపుణ్యాలను పెంచేందుకు స్థానిక సంస్థలకు, అన్ని స్థాయుల్లోని ప్రభుత్వ అధికారులకు నిరంతర శిక్షణ అ వసరం.

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఇళ్లలో మరుగు దొడ్డి తప్పక కలిగి ఉండాలనే నిబంధన విధించాలి.

వైద్య, జీవ వ్యర్థాలు, ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలు, తదితర అన్ని వ్యర్థాల నిర్వహణ విషయంలో చట్టాలను, జరిమానాలను పటిష్ఠంగా అ మలు చేసేలా, ఇప్పుడున్న అన్ని నియమ నిబంధనలను, మున్సిపల్‌ చట్టాలను సమీక్షించి సరిచేయాలి.

వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాల్లో చెత్త ఏ రుకునే వారికి ప్రాధాన్యం కల్పించాలి.

పాకీ పని నిషేధ చటాన్ని గట్టిగా అ మలు చేయడం ద్వారా మనుషుల ద్వారా మానవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలను (పాకీ పని) పూర్తిగా నిరోధించాలి.

అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, బ్లాకులు, జిల్లాలు, రాష్ట్రాలకు ప్రతి ఏటా స్వచ్ఛ భారత్‌ గ్రేడింగ్‌ / రేటింగ్‌ ఇ వ్వాలి. తద్వారా వాటి మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించాలి.

ప్రతి నెలా ఒ క రోజును, ఏటా అ క్టోబర్‌ 2 తో పూర్తయ్యే ఒ క వారాన్ని స్వచ్ఛ భారత అభియాన్‌ కార్యక్రమం కోసం కేటాయించాలి. ఇందులో అత్యుత్తమ పనితీరు కనబరచిన గ్రామ పంచాయతీని, బ్లాకును, పట్టణాభివృద్ధి సంస్థను, జిల్లాను, రాష్ట్రాన్ని రేటింగుల ఆధారంగా సత్కరించాలి. ఈ అ వార్డులు ఇచ్చే కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు పాల్గొనాలి.
సంపూర్ణ పారిశుద్ధ్య‌ కార్యక్రమం కింద నిర్మించిన మరుగుదొడ్లలో పనిచేయని వాటిని పూర్తిగా లేనట్టే భావించాలి. తద్వారా వాటి బదులు కొత్త మరుగుదొడ్ల నిర్మాణానికి, ఒ క దఫా ఆర్థిక సాయానికి మళ్లీ అ ర్హత కల్పించాలి.

ఒ క ఐహెచ్‌హెచ్‌ఎల్‌ యూనిట్‌ నిర్మాణానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాయితీ మొత్తం సమానంగా ఉండాలి. రెండు ప్రాంతాల్లోనూ ఈ రాయితీ మొత్తాన్ని రూ.15,000కు పెంచాలి.

వివిధ రంగాలు, విభాగాల మధ్య ఏర్పడే సమస్యల పరిష్కారానికి నీతి ఆ యోగ్‌ ఒ క ఉ మ్మడి వేదికను రూపొందించాలి. ఆ యా మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ద్వారా నీతి ఆ యోగ్‌, 1.ఓడీఎఫ్‌ను అంచనా వేయడం 2. ఓడీఎఫ్‌ ప్లస్‌ను అంటే పరిశుభ్రతను అంచనా వేయడానికి ఒ క నిష్పాక్షిక విధానాన్ని రూపొందించాలి. అంతేకాకుండా ఓడీఎఫ్‌ స్థాయిని అంచనా వేయడంలో రాష్ట్రాలు ఏ కరీతి విధానాన్ని అ మలు చేసేలా చూసేందుకు నీతి ఆ యోగ్‌ ఒ క తనిఖీ పద్ధతిని, జాతీయ స్థాయి మార్గదర్శకాలను రూపొందించాలి.