పిఎంఇండియా
నేడు స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవం (మహాసమాధి దినం) సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో స్వామి వివేకానంద చేసిన అసాధారణ కృషి తరతరాలకూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు. ఆయన అపారమైన జ్ఞానం, శాశ్వతమైన ఆదర్శాలు నేటికీ దేశంలోని లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలనే మన సామూహిక సంకల్పానికి, స్వామిజీ అందించిన ఆధ్యాత్మిక సందేశం నిరంతరం సరికొత్త శక్తిని, స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘స్వామి వివేకానంద నిర్వాణ దినోత్సవం సందర్భంగా ఆయనకు శతకోటి ప్రణామాలు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అసాధారణమైనది. ఆయన మేధోశక్తి, స్ఫూర్తిదాయక ఆలోచనలు నేటికీ లక్షలాది మంది యువతకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. వికసిత్ భారత్ నిర్మాణ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆయన ఆధ్యాత్మిక సందేశాలు దేశానికి నిరంతరం సరికొత్త శక్తిని, దిశానిర్దేశాన్ని అందిస్తూనే ఉంటాయి’’.
***
स्वामी विवेकानंद जी के निर्वाण दिवस पर उन्हें कोटि-कोटि नमन। भारतीय संस्कृति, अध्यात्म और राष्ट्र-चेतना को वैश्विक पहचान दिलाने में उनका योगदान अतुलनीय है। उनकी बौद्धिकता और प्रेरणादायी विचार आज भी करोड़ों युवाओं का मार्गदर्शन कर रहे हैं। उनके आध्यात्मिक संदेश विकसित भारत के…
— Narendra Modi (@narendramodi) July 4, 2026