Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స‌ఫాయిగిరి స‌మ్మిట్, అవార్డుల స‌భ 2015లో ప్ర‌ధాని

స్వ‌చ్ఛ భార‌త్ ఉద్య‌మం చేప‌ట్ట‌డానికి మ‌హాత్మాగాంధీ అతి పెద్ద స్ఫూర్తి అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. న్యూఢిల్లీ లో ఇండియా టుడే సంస్థ నిర్వ‌హించిన స‌ఫాయిగిరి స‌మ్మిట్, అవార్డుల సభ‌లో ఆయన‌ మాట్లాడుతూ గ‌త ఏడాది కాలంలో స్వ‌చ్ఛ‌భార‌త్ ఉద్య‌మంలో ఎంద‌రో భాగ‌స్వాముల‌య్యార‌ని, ఎంతో మంది చేయూత అందించార‌ని అన్నారు.ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ళ‌డంతో ఎల‌క్ట్రానిక్ మీడియా ఎంతో క్రియాశీల‌మైన పాత్ర పోషించింద‌ని, ఈ కార్య‌క్ర‌మంలోని పాజిటివ్ అంశాల‌కు ప్ర‌ముఖంగా ప్ర‌చారం క‌ల్పించింద‌ని ప్ర‌ధాని తెలిపారు.

స్వ‌చ్ఛ‌త/ప‌రిశుభ్ర‌త అనేది రోజువారీ అల‌వాటు అని, ఒక‌సారి ఇది అల‌వాటుగా మారితే వ్య‌క్తులు చెత్తా చెదారంతో కూడిన ప‌రిశుభ్ర‌త‌ లేని ప‌రిస‌రాల‌ను ఏ మాత్రం స‌హించ‌లేర‌ని ఆయ‌న చెప్పారు. వ్యక్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, సామాజిక ప‌రిశుభ్ర‌త అంటే భారత స‌మాజానికి ఎంతో ఆస‌క్తి అని ప్ర‌ధాని అన్నారు. అయినప్ప‌టికీ ఎంతో కాలంగా ఇది నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్న అంశ‌మ‌ని, ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

అప‌రిశుభ్ర‌త కార‌ణంగా దేశంలో రోజూ వెయ్యి మంది పిల్ల‌లు మృత్యువాత ప‌డుతున్నార‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు. స్వ‌చ్ఛ‌భార‌త్ ను కేవ‌లం ఒక ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంగానే చూడ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల్ని కోరిన ఆయ‌న‌ ఇది ప్ర‌తి ఒక్క‌రి కార్య‌క్ర‌మమ‌ని భావించాల‌న్నారు. భార‌త‌దేశం స్వ‌చ్ఛంగా ఉండాల‌ని 125 కోట్ల మంది జ‌నాభాలో ప్ర‌తీ ఒక్క‌రూ భావిస్తే భార‌త్ పూర్తి స్వ‌చ్ఛత గ‌ల దేశంగా మారిపోతుంద‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

అవార్డుల‌కు ఎంపికైన వారు స్వ‌చ్ఛ‌త కోసం చేసిన కృషిని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. వారు ఎంద‌రికో స్ఫూర్తిగా నిలుస్తార‌ని ఆయ‌న చెప్పారు. గ‌త ఏడాది కాలంగా స్వ‌చ్ఛ‌భార‌త్ కోసం విశేష‌మైన కృషి చేసిన వారిని ప్ర‌త్యేకించి యువ‌త‌ను ఆయ‌న ఉదాహ‌ర‌ణ‌గా చూపారు.