Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిందూస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, కోల్‌క‌తా మూసివేత‌కు మంత్రివర్గం ఆమోదం


హిందూస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్‌) కోల్‌క‌తాను కంపెనీల చ‌ట్టం 1956/2013, పారిశ్రామిక‌ వివాదాల చ‌ట్టం, 1947, ఇత‌ర సంబంధిత చ‌ట్టాల‌కు అనుగుణంగా మూసివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశంలో దీనిని ఆమోదించారు. సిబ్బందికి 2007 నోష‌న‌ల్ పే స్కేల్స్ ఆధారంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన వి.ఆర్‌.ఎస్/ విఎస్ఎస్ ప్యాకేజ్‌లు ఇవ్వ‌డంతో పాటు 2015 నుండి వారు విఆర్ ఎస్ వి.ఎస్‌.ఎస్ తీసుకొని కంపెనీకి దూర‌మ‌య్యే వ‌ర‌కు గ‌ల‌ కాలానికి వేత‌నాలు, జీతాల వంటి సంబంధిత బాధ్యతలను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తారు. ఖాయిలా ప‌డిన‌, న‌ష్ట‌దాయ‌క కేంద్ర ప్ర‌భుత్వ‌ రంగ ఎంట‌ర్‌ప్రైజెస్‌ల‌ (సిపిఎస్ ఇస్)ను త‌గిన కాల‌ప‌రిమితితో మూసివేసేందుకు నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాలు, స్థిర చ‌రాస్తుల అమ్మ‌కానికి సంబంధించిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ కంపెనీ ఆస్తుల‌ను అమ్ముతారు.

కంపెనీని మూసివేసేందుకు న‌గ‌దు ద్వారా స‌మ‌కూర్చ‌నున్న మొత్తం రూ.1,309.90 కోట్లు కాగా, న‌గ‌దేత‌ర మార్గంలో స‌మ‌కూర్చ‌నున్న మొత్తం రూ.3,467.15 కోట్లు. దీనిని భార‌త ప్ర‌భుత్వం 30.09.2016 వ‌ర‌కు ఉన్న త‌న‌ రుణాన్ని ( వ‌డ్డీతో స‌హా) ఈక్విటీ రూపంలోకి మార్చ‌నుంది.

ఎస్‌బిఐ నాయ‌క‌త్వంలో క‌న్సార్టియంగా ఏర్ప‌డిన హెచ్‌సిఎల్ కోల్‌క‌తా సెక్యూర్డ్ రుణ‌దాత‌లు సంస్థ‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంలో ఎంతో ఉదారంగా వ్య‌వ‌హ‌రించారు. ఏక కాల‌ప‌రిష్కారం నిబంధ‌న‌లలో(ఒటిఎస్‌) వ‌డ్డీ పూర్తిగా ర‌ద్దు, త‌మ వ‌ద్ద‌గ‌ల అస‌లు రుణం 305.63 కోట్ల రూపాయ‌ల ప‌రిష్కారం ఉన్నాయి.

2003 జ‌న‌వ‌రి నుండి కంపెనీలో ఎలాంటి ఉత్ప‌త్తి కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌డం లేదు. కంపెనీ ఉద్యోగులు 1997 పే స్కేల్స్‌లో ఉన్నారు. వేత‌నాలు, జీతాల చెల్లింపులు లేక‌పోవ‌డంతో త‌మ ఆర్థిక అస‌వ‌రాల‌ను తీర్చుకోవడం వారికి ఇబ్బందిగా ప‌రిణ‌మించింది. విఆర్‌ఎస్‌/ విఎస్ఎస్ ప్యాకేజ్ ప్ర‌క‌టించ‌డం, ఇత‌ర బ‌కాయిల‌ను చెల్లించ‌నుండ‌డంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల‌ నుండి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. ఇది వారి ప‌ద‌వీ విర‌మ‌ణ పున‌రావాసానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. కంపెనీని నిర్ణీత కాల‌ప‌రిమితితో మూసివేసేందుకు నిర్ణ‌యించ‌డంతో, కంపెనీకి చెందిన విలువైన ఆస్తులు ఇత‌ర అవ‌స‌రాల‌కు గ‌రిష్ఠంగా ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి.

పూర్వ రంగం :

హెచ్‌ సిఎల్‌ను 1952 వ సంవ‌త్స‌రంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ‌కు రూప్‌నారాయ‌ణ్‌పూర్ (ప‌శ్చిమ బెంగాల్‌), హైద‌రాబాద్ (తెలంగాణ‌), నైని (యు.పి.), న‌రేంద్ర‌పూర్ (ప‌శ్చిమ‌ బెంగాల్‌) ల‌లో నాలుగు యూనిట్లు ఉన్నాయి. హెచ్‌ సిఎల్ నమోదిత కార్యాల‌యం కోల్‌క‌తాలో ఉంది. ఈ కంపెనీని ప్ర‌భుత్వ రంగ టెలికం కంపెనీలైన బిఎస్ఎన్ ఎల్‌, అలాగే ఎంటిఎన్‌ఎల్ ల టెలికం కేబుల్ అవ‌స‌రాలు తీర్చేందుకు ఏర్పాటు చేశారు. టెలికం రంగంలో శ‌ర‌వేగంతో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా ( వైర్ లైన్ నుంచి వైర్ లెస్‌కు) టెలికం కేబుల్స్‌కు గిరాకీ బాగా త‌గ్గింది. కంపెనీని పున‌రుద్ధ‌రించేందుకు భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌ శాఖ ప‌లు ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫ‌లించ‌లేదు. హెచ్‌సిఎల్ యూనిట్ల‌ను ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌, ర‌క్ష‌ణ ఉత్ప‌త్తి విభాగానికి బ‌దిలీ చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నాలూ ఫ‌లితాన్నివ్వ‌లేదు. బిఐఎఫ్‌ఆర్, బిఆర్ పి ఎస్ ఇ సిఫార్సులు, అలాగే ఆర్ధిక‌ వ్య‌వ‌హారాల మంత్రివర్గ సంఘం 29-12-2014న ఖాయిలాప‌డిన సిపిఎస్ ఇల‌కు ప్ర‌ణాళికేత‌ర మ‌ద్ద‌తును తొల‌గించాల‌ని రూపొందించిన మార్గ‌సూచీ కి అనుగుణంగా కంపెనీని మూసివేసేందుకు ప్ర‌తిపాద‌న‌ల‌ను రూపొందించారు.

ఈ కంపెనీ 2002 నుండి బిఐఎఫ్ ఆర్ కు నివేదించిన కంపెనీ. కంపెనీని మూసివేసేందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని బిఐఎఫ్ ఆర్ అనుమ‌తి కోసం నివేదిస్తారు. కంపెనీ ఉద్యోగుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన విఆర్‌ఎస్‌/ విఎస్‌ఎస్ ను అందిస్తుంది. రిట్రెంచ్‌మెంట్ విధానం కూడా పారిశ్రామిక వివాదాల చ‌ట్టం, 1947కు అనుగుణంగా చేప‌డ‌తారు. కంపెనీ భూమి కి సంబంధించి ఆస్తుల‌ను విడిపించేందుకు సెక్యూర్డ్ రుణ‌దాత‌ ల‌తో ఒటిఎస్ చేసుకుంటారు. కంపెనీని మూసివేసే స‌మ‌యంలో ఎదుర‌య్యే ఇత‌ర బాధ్య‌త‌లు, అంటే చ‌ట్ట‌బ‌ద్ధమైన బాధ్య‌త‌ల‌ విష‌యంలో చ‌ట్ట నిబంధ‌న‌ల‌కు లోబ‌డి, డిపార్ట్ మెంట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటారు