Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్ లో విషాద ఘటన పై దుఃఖం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


హిమాచల్ ప్రదేశ్ లో బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖం వ్యక్తం చేశారు.

“హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారి వేదనలో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను”, అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

****