Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డిన కార‌ణంగా ప్రాణ న‌ష్టం వాటిల్లడం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన‌ మంత్రి


హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండీ జిల్లా లో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ‌టంతో జ‌రిగిన ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారం వ్య‌క్తం చేశారు.

“హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండీ జిల్లా లో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డి ప్ర‌మాదాల‌కు దారి తీయ‌డంతో ప్రాణ న‌ష్టం వాటిల్లినందుకు బాధ‌పడ్డాను. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు నా సంతాపం తెలియ‌జేస్తున్నాను.

హిమాచల్ ప్ర‌దేశ్ లోని మండీ జిల్లాలో గాయ‌ప‌డిన‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడిని ప్రార్థిస్తున్నాను.

ర‌క్ష‌ణ మ‌రియు స‌హాయ‌క కార్య‌క‌లాపాల‌లో పాలుపంచుకొని అవసరమైన అన్ని విధాలుగాను స‌హాయాన్ని అందించ‌డానికి ఎన్‌డిఆర్ఎఫ్ బృందం మండీకి తరలివెళ్తోంది” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.