Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హెచ్‌టీ లీడ‌ర్‌షిప్ స‌మిట్‌లో ప్ర‌ధాని ప్ర‌సంగం


న్యూఢిల్లీలో ఈ రోజు జ‌రిగిన ద హిందుస్తాన్ టైమ్స్ లీడ‌ర్‌షిప్ స‌మిట్ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా ఆయన మ‌రింత ఉజ్జ్వ‌ల‌మైన భ‌విష్య‌త్తు దిశ‌గా భార‌త్ చేస్తున్న ప్ర‌యాణం గురించి అభివ‌ర్ణిస్తూ, భార‌త‌దేశం ఇప్పుడు చేరుకున్న మ‌జిలీని ప్ర‌పంచ దృష్టికోణంతో పాటు కొన్ని సంవ‌త్స‌రాల కింద‌ట భార‌త‌దేశం ఎక్క‌డ నిల‌బ‌డింద‌న్న దృష్టికోణంలో నుంచి కూడా గ‌మ‌నించాల‌న్నారు.

ఆర్థిక సంస్కరణలపై తన ఆలోచనలను గురించి ప్రధాని వివరిస్తూ, ఇటీవల సాధించిన ప్రధానమైన ఆర్థిక విజయాలలో కొన్నింటిని ప్రస్తావించారు. వాటిలో 7.4 శాతం జీడీపీ వృద్ధి రేటు, భారత్ లో వ్యాపారం చేయడం అనే ప్రక్రియను సులభతరంగా మార్చడంలో సాధించిన పురోగతి ల వంటివి ఉన్నాయన్నారు. వ్యాపారం సులువుగా చేసుకోవడమన్నది కేంద్రంతో పాటు రాష్ర్టాలు కూడా కలసి పనిచేసినప్పుడే మరింతగా మెరుగుపడగలదని ప్రధాని చెప్పారు. రాష్ట్రా లకు ప్రస్తుతం 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ఆధారంగా అదనపు నిధులను అందించినట్లు తెలిపారు.

ఎల్ పీజీ సబ్సిడీని నేరుగా బదలాయిస్తుండటం, ఎల్ ఈ డీ బ‌ల్బుల‌ పథకాల వల్ల కోట్లాది రూపాయలు ఎలా ఆదా అవుతున్నదీ ప్రధాన మంత్రి వివరించారు. యూరియాకు వేప పూత పద్ధతిని పాటించడం వల్ల.. వ్యవసాయానికి ఉద్దేశించిన యూరియాను పక్కదారి పట్టిస్తుండటాన్ని నివారించగలుగుతున్నామన్నారు. రైల్వేల రంగంలోకి ఇటీవల తరలివచ్చిన ఎఫ్ డీ ఐ ల సంగతిని ప్రధాని గుర్తు చేశారు. ఈ ఎఫ్ డీ ఐ లు బీహార్ లో నిర్మించనున్న రెండు రైలుబండ్ల తయారీ కర్మాగారానికి సంబంధించినవి.

భారతదేశంలో విద్యుత్తు సౌకర్యానికి నోచుకోని 18,000 పల్లెలకు విద్యుత్తు ను అందించడానికి చేపట్టిన ప్రక్రియను గురించి కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనేది గ్రామీణ్ విద్యుతీకరణ్ యాప్ ను ఉపయోగించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.