Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైద‌రాబాద్ రాష్ట్రాన్ని భార‌తదేశం లో విలీనం చేసిన సంద‌ర్భంలో దేశ ఐక్య‌త కోసం ప్రాణ‌ త్యాగాలు చేసివారికి ప్ర‌ధాని సెల్యూట్‌


దేశ స‌మైక్య‌త కోసం, హైద‌రాబాద్ రాష్ట్రాన్ని భార‌త్ లో విలీనం చేసిన సంద‌ర్భంగా ప్రాణత్యాగాలు చేసిన వారికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు. హైద‌రాబాద్ విలీనంలో కీల‌క పాత్ర పోషించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

‘‘హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసిన సందర్భంగా ప్రాణత్యాగాలు చేసిన వారందరికీ పేరుపేరునా వందనాలు చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి లేనిదే హైద‌రాబాద్ రాష్ట్ర విలీన‌మే లేదు. దేశ స‌మైక్య‌త కోసం స‌ర్దార్ చేసిన కృషిని మ‌రోసారి గుర్తు చేసుకోవాల్సిన త‌రుణం ఇది’’ అని ప్ర‌ధాని అన్నారు.