Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైద‌రాబాద్ లో సిఐఆర్ డిఎపి ఏర్పాటు ఒప్పందంపై సంత‌కం చేయ‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


హైద‌రాబాద్ లోని జాతీయ గ్రామీణాభివృద్ధి మ‌రియు పంచాయ‌తీరాజ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ ఐఆర్ డి అండ్ పిఆర్‌) ఆవ‌ర‌ణ‌లో ఆసియా ప‌సిఫిక్ దేశాల్లో స‌మ‌గ్ర గ్రామీణాభివృద్ధి కేంద్రం (సిఐఆర్ డిఎపి.. ‘సిర్ డాప్‌’) విభాగం ఏర్పాటు చేసేందుకు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌, ఆసియా ప‌సిఫిక్ దేశాల్లో స‌మ‌గ్ర గ్రామీణాభివృద్ధి కేంద్రం మ‌ధ్య అంగీకార ఒప్పందంపై సంత‌కాలు చేసేందుకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన‌ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

హైద‌రాబాద్ లోని ఎన్ ఐఆర్ డి అండ్ పిఆర్ లో సిర్ డాప్ కేంద్రం ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల గ్రామీణాభివృద్ధి కార్య‌క్ర‌మాలలో ప్ర‌త్యేక నైపుణ్యాలు సాధించిన సంస్థ‌ల నుండి ఆయా కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని నేరుగా అందుకొనే అవ‌కాశం క‌లుగుతుంది. అలాగే ఎన్ ఐఆర్ డి అండ్ పిఆర్ లో ఒక రెపాజిట‌రీ అభివృద్ధి కావ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. అంతే కాదు, సిర్ డాప్ స‌భ్య‌త్వ దేశాలలోని మంత్రిత్వ శాఖ‌లు, సంస్థ‌ల‌తో అనుసంధానం కావ‌డం ద్వారా ప్రాంతీయంగా ఎన్ ఐఆర్ డి అండ్ పిఆర్ హెదా పెరుగుతుంది. ప‌ర‌స్ప‌ర సంద‌ర్శ‌న‌ల ద్వారా మంత్రిత్వ శాఖ అధికారులు, ఎన్ ఐఆర్ డి అండ్ పిఆర్ అధ్యాప‌క సిబ్బంది ప్ర‌యోజ‌నం పొందుతారు. సిఎమ్ సి దేశాలలో పేద‌రిక నిర్మూల‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా స‌మ‌గ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధిచిన కార్య‌క్ర‌మాల అమ‌లుపై సిర్ డాప్ దృష్టి పెట్ట‌గ‌లుగుతుంది.

పూర్వ‌రంగం

ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలోని దేశాలు, ఐక్య‌రాజ్య‌స‌మితికి చెందిన ఆహార‌, వ్య‌వ‌సాయ సంస్థ (ఎఫ్ఎఒ), ఐక్య‌రాజ్య‌స‌మితి చొర‌వ‌తో ప్రాంతీయంగా ప్ర‌భుత్వాల మ‌ధ్య అంత‌ర్గ‌త స‌హ‌కారం పెంపొందించ‌గ‌ల‌, పూర్తి స్వ‌యంప్ర‌తిప‌త్తి సంస్థ‌గా సిర్ డాప్ 1979లో ఏర్పాట‌యింది. ఐక్య‌రాజ్య‌స‌మితికి సంబంధించిన వివిధ సంస్థ‌లు, దాత‌ల మద్దతు దీనికి లభించింది. ఈ సంస్థ కీల‌క వ్య‌వ‌స్థాప‌క దేశాలలో భార‌తదేశం ఒక‌టి. దీని ప్ర‌ధాన కార్యాల‌యం బంగ్లాదేశ్ లోని ఢాకా లో ఉంది. ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ‌, స‌మాచార వ్యాప్తి ద్వారా స‌భ్యత్వ దేశాలలో స‌మ‌గ్ర గ్రామీణాభివృద్ధిని ప్రోత్స‌హించ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌డం, ప్రాంతీయ స‌హ‌కార శ‌క్తిగా నిల‌వ‌డం సిర్ డాప్ ల‌క్ష్యాలు.

సిర్ డాప్ ప్రాంతీయ కార్యాల‌యం ఒక‌టి ఇండోనేసియాలోని జ‌కార్తా లో ఉంది. సిర్ డాప్‌ ఆగ్నేయాసియా దేశాల ఉప ప్రాంతీయ కార్యాల‌యం కూడా 1997లో జ‌కార్తా లోనే ఏర్పాట‌యింది. సిర్ డాప్ స‌భ్య‌త్వం, వ‌న‌రుల‌ను విస్త‌రించ‌డం, ద‌క్షిణాసియా ప్రాంతానికి చెందిన ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టులను చేప‌ట్ట‌డం, ప‌రిశోధ‌న కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డం ఈ ఉప కేంద్రం ల‌క్ష్యాలు. ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో 46 దేశాలు ఉన్నాయి. సిర్ డాప్ విస్త‌ర‌ణ‌కు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. దీని ద్వారా సిర్ డాప్ సెంట‌ర్ల స‌హాయం కూడా అందుతుంది.

***