Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018, జూన్ 23న‌ మ‌ధ్య ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, జూన్ 23వ తేదీన మ‌ధ్య ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు.

ప్ర‌ధాన మంత్రి ఇందౌర్ లో జ‌రిగే మ‌ధ్య ప్ర‌దేశ్ శెహ‌రీ వికాస్ మ‌హోత్స‌వ్ కు హాజ‌రవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌లో 4000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వేరు వేరు ప‌ట్ట‌ణాభివృద్ధి ప‌థ‌కాల‌ను రిమోట్ సాయం తో ప్ర‌ధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ ప‌థ‌కాల‌లో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద నిర్మించే గృహాలు, ప‌ట్ట‌ణ ప్రాంత త్రాగునీటి స‌ర‌ఫరా ప‌థ‌కాలు, ప‌ట్ట‌ణ ప్రాంత సంబంధిత ఘన వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌, ప‌ట్ట‌ణ ప్రాంత పారిశుధ్యం, ప‌ట్ట‌ణ ప్రాంత ర‌వాణా మ‌రియు అర్బ‌న్ ల్యాండ్ స్కేప్ ప్రాజెక్టులు భాగంగా ఉంటాయి.

ఆయ‌న స్వచ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2018 పుర‌స్కారాల‌ను కూడా ప్ర‌దానం చేయ‌నున్నారు. స్వచ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2018 ఫ‌లితాల డాశ్‌బోర్డు ను ఆయ‌న ప్రారంభిస్తారు. అత్యంత శుభ్ర‌మైన న‌గ‌రాలు మ‌రియు అత్యంత ఉత్త‌మ‌మైన ప‌నితీరును క‌న‌బ‌ర‌చిన రాష్ట్రాలు ప్ర‌ధాన మంత్రి వ‌ద్ద నుండి పుర‌స్కారాల‌ను స్వీక‌రించ‌నున్నాయి. ఒక ‘స్వ‌చ్ఛ్ ఇన‌వేశ‌న్‌’, ఒక ‘స్వ‌చ్ఛ్ బెస్ట్ ప్రాక్టీస్’, ఇంకా ఒక ‘స్వ‌చ్ఛ్ ఆంత్రప్రెన్యూర్’ కూడా ప్ర‌ధాన మంత్రి వ‌ద్ద నుండి పుర‌స్కారాల‌ను అందుకొంటారు.

అంత‌కు ముందు మోహ‌న్‌పుర ప‌థ‌కాన్ని రాజ్‌గ‌ఢ్ లో దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి అంకితం చేయ‌నున్నారు. ఈ ప‌థ‌కం రాజ్‌గ‌ఢ్ జిల్లాలో వ్య‌వ‌సాయ భూముల‌కు సాగునీటి పారుద‌ల స‌దుపాయాన్ని క‌ల్పిస్తుంది. అలాగే, ఈ ప‌థ‌కం ఆ ప్రాంతం లోని ప‌ల్లెల‌కు త్రాగునీటిని కూడా అందిస్తుంది. ప్ర‌ధాన మంత్రి వేరు వేరు త్రాగునీటి ప‌థ‌కాల‌కు ఒక పునాది రాయిని కూడా వేస్తారు.

***