Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో


2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన ఇషా సింగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

మంచి స్కోరుతో ఇషా అపారమైన కచ్చితత్త్వాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించారని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన ఇషా సింగ్‌కు అభినందనలు. మంచి స్కోరుతో ఇషా అపారమైన కచ్చితత్త్వాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ“