పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో మహిళల 78 కిలోల కురాష్ విభాగంలో కాంస్య పతకం సాధించిన పింకీ బల్హారాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
పోటీ మొత్తంగా ఆమె అసాధారణమైన పట్టుదల, సంకల్పాన్ని ప్రదర్శించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఆమె మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, దేశానికి మరింత పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“ఆసియా క్రీడల మహిళల 78 కిలోల కురాష్ విభాగంలో కాంస్య పతకం సాధించిన పింకీ బల్హారాకు అభినందనలు. పోటీ మొత్తంగా ఆమె అసాధారణమైన పట్టుదల, సంకల్పాన్ని ప్రదర్శించారు. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ“
Congrats to Pinkcy Balhara on securing the Bronze Medal in the Women’s 78kg Kurash Asian Games event. She displayed tremendous grit and resolve throughout. May she continue to scale new heights and bring further laurels in the times to come: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2026