Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ)-2026లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు


కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ)-2026లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందం– శ్రీ కనిష్క్ జైన్శ్రీ రిద్ధేశ్ అనంత్ బెండాలేశ్రీ రుషిత్ గర్గ్శ్రేష్ఠ్ సురైయాస్వరిత్ జోషీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

వారు సాధించిన ఈ విజయం దేశ యువత అపరిమిత సత్తాకీవిజ్ఞానశాస్త్రంపరిశోధన అంటే వారికి ఉన్న మక్కువకీ మరో ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు.

గత దశాబ్దంలో ఈ వేదికకు సంబంధించిన వివిధ సంచికలలో భారతీయ విద్యార్థులు అసాధారణంగా రాణించారని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :

‘‘కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్(ఐపీహెచ్ఓ)-2026 లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందం శ్రీ కనిష్క్ జైన్శ్రీ రిద్ధేశ్ అనంత్ బెండాలేశ్రీ రుషిత్ గర్గ్శ్రేష్ఠ్ సురైయాస్వరిత్ జోషీలకు అభినందనలు.

వారు సాధించిన ఈ విజయం దేశ యువతలో ఉన్న అపరిమిత సత్తాకీ, విజ్ఞానశాస్త్రంపరిశోధన అంటే వారికి ఉన్న మక్కువకీ మరో ఉదాహరణగా నిలిచిందిగత దశాబ్దంలో ఈ వేదికకే సంబంధించిన వివిధ సంచికలలో భారతీయ విద్యార్థులు అసాధారణంగా రాణించడం కూడా ప్రశంసనీయమే’’ అని పేర్కొన్నారు.

 

***