Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏప్రిల్ 29న యుగ్మ్ సదస్సులో పాల్గొననున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 29న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే యుగ్మ్ సమ్మేళనంలో పాల్గొననున్నారుఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు

యుగ్మ్ (సంస్కృతంలో ‘సంగమం’ అని అర్థంఅనేది ప్రభుత్వవిద్యపరిశ్రమఆవిష్కరణ వ్యవస్థల నాయకులను కలిపే మొట్టమొదటి  వ్యూహాత్మక సమ్మేళనంవాధ్వానీ ఫౌండేషన్,  ప్రభుత్వ సంస్థల సంయుక్త పెట్టుబడితో సుమారు రూ.1,400 కోట్ల విలువైన భాగస్వామ్య ప్రాజెక్టు ద్వారా భారత దేశ ఆవిష్కరణ ప్రయాణానికి ఇది దోహదం చేయనుంది.

స్వావలంబనఆవిష్కరణ ఆధారిత భారతదేశం అనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగాఈ సదస్సులో వివిధ కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారువీటిలో ఐఐటీ కాన్పూర్‌ (కృత్రిమ మేధస్సుఇంటెలిజెంట్ వ్యవస్థలు) , ఐఐటీ బాంబే (జీవశాస్త్రంబయోటెక్నాలజీఆరోగ్యంవైద్యంసూపర్‌హబ్‌లుఅగ్రశ్రేణి పరిశోధనా సంస్థల్లో పరిశోధనా వాణిజ్యీకరణను ప్రోత్సహించేందుకు వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ (డబ్ల్యుఐఎన్కేంద్రాలుఅలాగే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఎన్ఆర్ఎఫ్ )తో కలిసి చివరి దశ అనువర్తిత ప్రాజెక్టులకు సంయుక్తంగా నిధులు సమకూర్చడానికిపరిశోధన – ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అవకాశం ఉంది.

ఈ సదస్సులో భాగంగా ప్రభుత్వ అధికారులుపరిశ్రమవిద్యా రంగానికి చెందిన ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలుప్యానల్ చర్చలు కూడా జరుగనున్నాయిపరిశోధనను వేగంగా అమలు దశకు తీసుకెళ్లే దిశగా కార్యాచరణ ఆధారిత చర్చలుభారత్ అంతటా ఉన్న డీప్ టెక్ స్టార్టప్‌ల తాజా ఆవిష్కరణల ప్రదర్శనవిభిన్న రంగాల్లో భాగస్వామ్యాలుసహకారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నెట్‌వర్కింగ్ అవకాశాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

ఈ సదస్సులో ప్రభుత్వ అధికారులుఅగ్రశ్రేణి పరిశ్రమ,  విద్యా రంగ ప్రముఖులు పాల్గొనే ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలుప్యానల్ చర్చలు నిర్వహించనున్నారుపరిశోధన ఫలితాలకు వేగంగా ఆచరణ రూపం కల్పించే చర్యలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయిభారత్ భారతదేశం నలుమూలల నుంచి అగ్రశ్రేణి ఆవిష్కరణలను ప్రదర్శించే డీప్ టెక్ స్టార్టప్ ఎగ్జిబిషన్,  విభిన్న రంగాలలో భాగస్వామ్యాలుసహకారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నెట్‌వర్కింగ్ అవకాశాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి.

 భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థలో భారీ స్థాయి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడంఅగ్రస్థానంలో ఉన్న సాంకేతిక రంగంలో పరిశోధనను వాణిజ్యపరమైన దశకు వేగవంతంగా తీసుకెళ్లడంవిద్యాపరిశ్రమప్రభుత్వ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంఏఎన్ఆర్ఎఫ్,  ఎఐసిటిఇ ఇన్నోవేషన్ వంటి జాతీయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంఆన్ని సంస్థల ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులో ఉంచడం, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు జాతీయ ఆవిష్కరణ దిశలో ఏకీకృత కృషిని ప్రోత్సహించడం వంటి ప్రధాన లక్ష్యాలతో  ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.