పిఎంఇండియా
‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పేరుతో భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ రచించిన ఆత్మకథను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘శ్రీ రాంనాథ్ కోవింద్ ఆత్మకథను ఆవిష్కరించుకునే అవకాశం ఈ రోజు మనకు లభించింది. ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావడం నాకెంతో సంతోషాన్నిస్తోంది’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు.
శ్రీ రాంనాథ్ కోవింద్‌తో ప్రగాఢమైన తన వ్యక్తిగత అనుబంధాన్ని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్లుగా ఆయన మార్గనిర్దేశం, ఆప్యాయతల పట్ల అపారమైన గౌరవాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ‘‘శ్రీ కోవింద్‌తో నాకు సుదీర్ఘ పరిచయముంది. ఆయనను దగ్గరగా చూసే అదృష్టం కలిగింది. రాష్ట్రపతి హోదాలో వారి మార్గనిర్దేశం మరువలేనిది. అన్నిటికన్నా ముఖ్యంగా.. నా పట్ల వారికున్న ప్రత్యేకమైన ఆప్యాయతానురాగాలే నాకు గొప్ప సంపద’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
శ్రీ కోవింద్ వ్యక్తిత్వ ఔన్నత్యాన్నీ, సమర్థతనూ శ్రీ మోదీ ప్రశంసించారు. ఆయన రచన దేశ ప్రజాస్వామ్య విలువలకు శాశ్వత నిదర్శనంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. “శ్రీ రాంనాథ్ కోవింద్ ఆత్మకథ దేశ ప్రజాస్వామ్యానికీ, భారతీయ సమాజానికీ గొప్ప వారసత్వ సంపదగా నిలుస్తుందని పూర్తి నమ్మకంతో చెప్పగలను’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
శ్రీ కోవింద్ దేశానికి అందించిన అపారమైన సేవలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. పుస్తకంలోని వివరాలను ఎక్కువగా వెల్లడించకుండా.. పాఠకులే స్వయంగా చదివి ఆ విశేషాలను తెలుసుకోవాల్సిందిగా ప్రోత్సహించారు. ‘‘పుస్తకావిష్కరణ సమయంలో గ్రంథ పరిచయం మాత్రమే ఉండాలి. మీరంతా ఈ పుస్తకాన్ని మొత్తం చదివితేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
యువతరానికి ఎన్నో విద్యాపరమైన మార్గదర్శక విలువలను కూడా ఈ ఆత్మకథ అందిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి మాటల నుంచి భావి తరాలు ప్రేరణ పొందాలని ఆకాంక్షించారు. ‘‘దేశ నవతరం కూడా ఆయన రచనలనూ, అనుభవాలనూ చదవాలి. వీటి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పుస్తకం పేరు ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ను విశ్లేషించారు. వ్యక్తిగత కష్టాలను అధిగమించడంతోపాటు, దేశ ప్రజాస్వామ్య విజయమనే రెండు ముఖ్యమైన అంశాలు అందులో భాగంగా ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. ‘‘జీవిత పోరాటాలు ఆయన వ్యక్తిగతం. అయితే, ఆ పోరాటాల ద్వారా సాధించిన విజయం భారత్‌దీ, దేశ ప్రజాస్వామ్యానిదీ’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
శ్రీ రాంనాథ్ కోవింద్ ఉదారమైన ఆలోచనలు సగటు మనిషి సహజ ధోరణికి భిన్నమైనవన్నారు. చాలామంది తమ కష్టాలకు సమాజాన్ని నిందిస్తుంటారనీ, కానీ భారతీయ విలువల్లో బలంగా వేళ్లూనుకున్న శ్రీ కోవింద్ హృదయం మాత్రం.. తన విజయంలో సమాజాన్ని కూడా భాగస్వామిగా భావిస్తుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘హృదయంలో ఔదార్యం, భారతీయ విలువలు ఉంటే.. ఆ మనిషి సమాజంలో తప్పులు వెతుకుతూ సమయాన్ని వృథా చేయడు. సమాజంలోని సానుకూల అంశాలపైనే దృష్టి సారిస్తాడు’’ అని శ్రీ మోదీ చెప్పారు.
ఈ ఆత్మకథలో పేర్కొన్న ఒక విషాదకరమైన చిన్ననాటి ఘట్టాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. కాన్పూర్ దేహాత్‌లోని ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. నిత్యావసర వస్తువులను బయటకు తెచ్చే ప్రయత్నంలో.. శ్రీ రాంనాథ్ కోవింద్ తల్లి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ‘‘చిన్నతనంలోనే ఇలాంటి ప్రమాదం జరగడం, అలా తల్లిని కోల్పోవడం ఎంతటి వేదనను మిగిల్చి ఉంటుందో మీరు ఊహించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఈ విషాదానంతరం తిరిగి గుండెనిబ్బరాన్ని కూడగట్టుకున్న తీరును ప్రధానమంత్రి వివరించారు. పొరుగున ఉన్న ఒక తల్లి శ్రీ కోవింద్ పెంపకంలో ఎలా తోడ్పడిందో, ఆ సంఘటన సామాజిక సామరస్యంపై ఆయన అవగాహనను ఏ విధంగా లోతుగా ప్రభావితం చేసిందో శ్రీ మోదీ వివరించారు. ‘‘దీన్నుంచే సమాజ ఐక్యత, సమరసతా శక్తిని ఆయన అర్థం చేసుకున్నారు. ఆ కష్టాలు శ్రీ రాంనాథ్ కోవింద్‌ను మరింత దృఢంగా మార్చాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఆ విషాదం తర్వాత శ్రీ కోవింద్ తండ్రి వ్యవహరించిన స్ఫూర్తిమంతమైన తీరును ప్రధానమంత్రి వివరించారు. ఆయన కుటుంబాన్ని నడిపించిన విధానం, పిల్లల్లో బలమైన విలువలను నూరిపోసిన విధానాన్ని గుర్తుచేశారు. ‘‘ఆయన కుటుంబాన్ని నడిపించిన తీరు, పిల్లలకు విలువలను నేర్పించిన విధానం వల్లే.. శ్రీ కోవింద్ తన తండ్రిని హీరోగా భావిస్తారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పేదరికాన్ని అధిగమించడానికి శ్రీ కోవింద్ విద్యనే ఆసరాగా చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. దేశ అత్యున్నత పదవిని చేపట్టేలా ఎదిగిన ఆయన అసాధారణ ప్రస్థానాన్ని వివరించారు. ‘‘ఆయన కష్టపడ్డారు. పేదరికాన్ని బలహీనతగా మారనివ్వలేదు. ఆ రోజుల్లో ప్రజలు కనీసం ఊహించను కూడా లేని అత్యున్నత స్థానానికి ఎదిగారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
మాజీ రాష్ట్రపతి నిరాడంబరతను, వినయాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. శ్రీ కోవింద్ తన స్వగ్రామం పరోంఖ్కు వచ్చినప్పుడు.. అక్కడి నేలకు నమస్కరించి, తన పూర్వ ఉపాధ్యాయుల పాదాలను తాకిన భావోద్వేగభరితమైన ఘట్టాన్ని గుర్తుచేశారు. ‘‘ఆయన నడవడి.. భారతీయ విలువలను ప్రపంచం ముందు నిలిపింది. ప్రతి భారతీయుడికీ అది గర్వకారణం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
శతాబ్దాల పరాధీనత వల్ల ఎదురైన సామాజిక – ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రస్తావిస్తూ… మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబాపూలే వంటి చరిత్రాత్మక మహనీయుల నిరంతర పోరాటాలనూ, దూరదృష్టి కలిగిన వారి స్వప్నాలనూ ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ‘‘అత్యంత నిరుపేద కూడా అత్యున్నత స్థానానికి చేరుకునే అవకాశం లభించేలా.. నవభారత పునర్నిర్మాణం జరగాలని అలాంటి మహానీయులెందరో కలలుగన్నారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ చారిత్రక ఆకాంక్షలనూ, ఆధునిక విజయాలనూ ముడిపెడుతూ… కఠోర శ్రమ ద్వారా సమసమాజ స్థాపన అనే శతాబ్దాల నాటి నినాదాన్ని సాకారం చేయడంలో కోవింద్ వంటి ఎందరో ప్రముఖులు కీలక పాత్ర పోషించారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు. ‘‘శ్రీ కోవింద్ వంటి వ్యక్తులు కష్టపడే తత్త్వంతో, సామర్థ్యంతో జీవితాలను తీర్చిదిద్దుకోవడం మాత్రమే కాదు.. శతాబ్దాల నాటి ఆ కలను సాకారం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిబద్ధత కలిగిన యువత ఎల్లప్పుడూ అత్యావశ్యకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆటంకాలకు జంకకుండా, దేశ ఆత్మనిర్భరత దిశగా మార్గం సుగమం చేసేలా ధైర్యంగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘ఈ మార్పుతోనే సాధికారిక భారత్‌ను నిర్మించాలన్న సంకల్పం సాకారమవుతుంది. ఆత్మనిర్భర, వికసిత భారత్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అత్యంత ప్రేరణదాయకమైనదిగా ఈ ఆత్మకథను పేర్కొంటూ… అత్యావశ్యకమైన ఇలాంటి యువశక్తిని తీర్చిదిద్దేందుకు శ్రీ కోవింద్ జీవిత విశేషాలు కచ్చితమైన మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి అన్నారు. ‘‘అలాంటి యువశక్తి నిర్మాణం కోసం కావాల్సిన ప్రేరణను శ్రీ కోవింద్ ఆత్మకథ అందిస్తుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
శ్రీ కోవింద్ రాజకీయ జీవిత ప్రారంభాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అంతర్గతంగా దేశసేవా భావన ఉన్న ఆయన పూర్తిస్థాయి రాజకీయాల దిశగా పయనం సాగించేందుకు.. మొరార్జీ దేశాయ్ సాహచర్యం ఏ విధంగా దోహదం చేసిందీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయనలో అంతర్గతంగా ఉన్న దేశసేవా తత్పరతకు.. మొరార్జీతో కలిసి పనిచేయడం ద్వారా ఒక సరైన మార్గం లభించింది’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఆయన సుదీర్ఘ సేవా ప్రస్థానాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. పార్లమెంటులో వివిధ పాత్రల్లో, గవర్నరుగా, ఆపై రాష్ట్రపతిగా వివిధ హోదాల్లో శ్రీ కోవింద్ కనబరిచిన అచంచలమైన కర్తవ్యనిష్ఠను ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘‘సేవే లక్ష్యంగా ఆయన పనిచేశారు. పార్లమెంటులో ఆయన బాధ్యతల నిర్వహణ తీరు దీనిని స్పష్టం చేస్తోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత కూడా శ్రీ కోవింద్ అవిశ్రాంత కృషిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగల.. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ వంటి కీలకమైన జాతీయ అంశాల్లో ఆయన నేతృత్వం వహిస్తుండడాన్ని ప్రశంసించారు. ‘‘శ్రీ కోవింద్ కర్తవ్య దీక్ష, సేవాభావాల నుంచి దేశ ప్రజలు ఎంతగానో నేర్చుకోగలరన్న దృఢమైన విశ్వాసం నాకుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
ప్రజాజీవితంలో అత్యంత క్రియాశీలంగా ఉంటూ కూడా ఆత్మకథను రాయడం అత్యంత కష్టతరమైన విషయమని శ్రీ మోదీ అన్నారు. సమాజానికి ఎంతో కీలకమైన ఈ రచనను పూర్తి చేసినందుకు శ్రీ కోవింద్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ‘‘శ్రీ కోవింద్ మనందరి కోసం ఈ రచన చేశారు. పేద, అట్టడుగు వర్గాల ప్రజల జీవితానికి అది అద్దం పడుతుంది. వారంతా తమ జీవిత ఛాయలను అందులో చూసుకోవచ్చు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ రచనలోని విస్తృతమైన నైతిక పాఠాలను వివరిస్తూ.. అత్యంత కఠినమైన సమయాల్లోనూ పవిత్రతకూ, నిజాయితీకీ కట్టుబడి ఉండడం ద్వారా లభించే అత్యున్నత శక్తిని మాజీ రాష్ట్రపతి జీవిత చరిత్ర చాటుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘వివిధ పదవుల్లో బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. దేశసేవకు అవసరమైన శక్తిని ఈ పవిత్రత మనకు ఎంతలా అందిస్తుందనే విషయంలో శ్రీ కోవింద్ సమాజానికి నిరంతర స్ఫూర్తిగా నిలిచారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఇది చరిత్రాత్మక రచనగా నిలుస్తుందని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. వ్యక్తిగత, జాతీయ ప్రాధాన్యం కలిగిన ఘట్టాల అత్యావశ్యక నిధి (ఆర్కైవ్)గా ఈ రచన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘శ్రీ రాంనాథ్ కోవింద్ ఆత్మకథ ఆయన జీవిత జ్ఞాపకాలనే కాకుండా.. మన ప్రజాస్వామ్య ప్రస్థానంలోని ఘట్టాలనూ పదిలపరుస్తుందన్న దృఢమైన నమ్మకం నాకుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
***
Speaking at the release of 'Triumph of the Indian Republic: My Life, My Struggles,' the autobiography of former President Shri Ram Nath Kovind Ji. His journey reflects a life dedicated to public service and the progress of our nation.@ramnathkovind
— Narendra Modi (@narendramodi) August 12, 2026
https://t.co/SCsPxznLG7
कोविन्द जी से मेरा लंबा परिचय... उन्हें करीब से जानने का सौभाग्य... राष्ट्रपति के रूप में उनका मार्गदर्शन... और, इस सबके साथ-साथ... उनका मेरे प्रति विशेष स्नेह, उनकी आत्मीयता... ये मेरी बहुत बड़ी पूंजी रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 12, 2026
आज हमें श्री रामनाथ कोविन्द जी की आत्मकथा के विमोचन का अवसर मिला है।
— PMO India (@PMOIndia) August 12, 2026
मुझे खुशी है कि मैं इस कार्यक्रम का हिस्सा बना हूँ: PM @narendramodi
महात्मा गांधी, बाबा साहब अंबेडकर, ज्योतिबा फुले, सावित्रबाई फुले... ऐसी कितनी ही महान विभूतियों ने भारत के नवनिर्माण का सपना देखा था।
— PMO India (@PMOIndia) August 12, 2026
एक ऐसा भारत…. जहां गरीब से गरीब, वंचित से वंचित को शिखर तक पहुँचने का अवसर मिल सके।
कोविन्द जी जैसे व्यक्तित्वों ने अपने श्रम और काबिलियत से…
राष्ट्रपति जैसे सर्वोच्च पद से सेवामुक्त होने के बाद भी उन्होंने विश्राम नहीं लिया है।
— PMO India (@PMOIndia) August 12, 2026
वो अभी भी ‘एक देश, एक चुनाव’ जैसे महत्वपूर्ण विषय पर काम कर रहे हैं।
ये एक ऐसा विषय है... जिसका समाधान देश के लोकतन्त्र का नया अध्याय शुरू कर सकता है!
मैं मानता हूँ... कोविन्द जी की इस…
Delighted to be a part of the release of former President Shri Ram Nath Kovind Ji’s autobiography, ‘Triumph of the Indian Republic: My Life, My Struggles.’ This book reflects the true strengths and possibilities of Indian democracy.@ramnathkovind pic.twitter.com/6Uqn3gYBiv
— Narendra Modi (@narendramodi) August 12, 2026
The book by former President Shri Ram Nath Kovind Ji is an inspiring read, wonderfully highlighting his struggles, service and rich contribution as MP, Governor and the President of India.@ramnathkovind pic.twitter.com/kSOOASCjgV
— Narendra Modi (@narendramodi) August 12, 2026
Shri Ram Nath Kovind Ji chose public service as the path of his life and remained deeply committed to his duties throughout. His dedication and spirit of service are an inspiration for every Indian.@ramnathkovind pic.twitter.com/FtLIYUDaV9
— Narendra Modi (@narendramodi) August 12, 2026