Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మలేషియా ప్రధానితో మాట్లాడిన భారత ప్రధాని


మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించి శుభాకాంక్షలు తెలిపారుపశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలపైనా చర్చించారు.

మలేషియా అధ్యక్షుడు అన్వర్ ఇబ్రహీంతో మాట్లాడిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. రానున్న హరిరాయ ఐదిల్‌ఫిత్రి పండుగ సందర్భంగా ఆయనకూఆ దేశ ప్రజలకూ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారుపశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఆందోళనకర పరిస్థితులపై చర్చించారుఉద్రిక్తతలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నట్టు ఈ సందర్భంగా వారిద్దరూ పునరుద్ఘాటించారుచర్చలుదౌత్యం ద్వారా వీలైనంత త్వరగా శాంతినీస్థిరత్వాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీమలేషియా ప్రధానమంత్రి ఇబ్రహీం స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘మిత్రుడుమలేషియా ప్రధానమంత్రి ఇబ్రహీంతో మాట్లాడానురానున్న హరిరాయ ఐదిల్‌ఫిత్రి పండుగ సందర్భంగా ఆయనకూఆ దేశ ప్రజలకూ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపాను.

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఆందోళనకర పరిస్థితిపైనా మేం చర్చించాంవీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించేందుకూఅలాగే చర్చలుదౌత్యం ద్వారా శాంతినీస్థిరత్వాన్నీ పునరుద్ధరించేందుకూ కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం.’’  

 

***