Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీకి నివాళి అర్పించిన ప్రధాని


శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ సేవ, ఆధ్యాత్మికతలకు జీవితాన్ని అంకితం చేశారని, సమాజంపై చెరగని ముద్ర వేశారని శ్రీ మోదీ కొనియాడారు. పూజ్య స్వామీజీ అనేక సంస్థలను, పరిశోధన కేంద్రాలను స్థాపించారని, ప్రజల్లో విద్యావ్యాప్తిని పెంచడానికి ఎంతో నిబద్ధతతో కృషి చేశారని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“వారణాసిలోని శ్రీ కాశీ మఠ సంస్థాన్‌కు చెందిన శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామిజీ జన్మ శతాబ్ది శుభ సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. సేవకు, ఆధ్యాత్మికతకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అనేక సంస్థలను, పరిశోధన కేంద్రాలను ఆయన ఏర్పాటు చేశారు. ప్రజల్లో విద్యావ్యాప్తిని పెంచి, వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషిచేశారు. నిరాడంబరత, కరుణ, దయ ఆయన బోధనల్లో ప్రతిబింబిస్తాయి. మన గడ్డపై ఉద్భవించిన భారతీయ సంస్కృతినీ, విలువలనూ పరిరక్షణకు ఆయన అద్భుత కృషీ ఎంతగానో ప్రశంసనీయమైనది.”