Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భగవాన్ మహావీర్ సందేశాల్లో అద్భుతమైన స్ఫూర్తి ఉందటూ.. సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


సత్యంసామరస్యంసత్ర్పవర్తనసమానత్వంతో కూడిన భగవాన్ మహావీర్ సందేశాలు అద్భుతమైన స్ఫూర్తిని కలిగిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. “మహావీర్ మహోన్నత ఆలోచనలు మానవాళికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయి” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు.

‘‘శ్రూయతాం ధర్మసర్వస్వం శ్రుత్వా చైవావధార్యతామ్

ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్’’

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“సత్యంసామరస్యంసత్ర్పవర్తనసమానత్వంతో కూడిన భగవాన్ మహావీర్ సందేశాలు అత్యంత స్ఫూర్తిదాయంఆయన ఉదాత్తమైన ఆలోచనలు మానవాళికి ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయి.

శ్రూయతాం ధర్మసర్వస్వం శ్రుత్వా చైవావధార్యతామ్

ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్”